Telugu Rasi Phalalu 2024 Monthly

dhannusrasi ధనస్సు రాశి

మార్చి నెల రాశిఫలాలు - 2023


ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి. ఆదాయం గతం కంటే మెరుగు పడుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. మాసం చివర మాత్రం బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.