Telugu Rasi Phalalu 2024 Monthly

mithunarasi మిథున రాశి

ఏప్రిల్ నెల రాశిఫలాలు 2023


ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలందు విశేషమైన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. ఆర్థికంగా గతం కంటే కొంత పరిస్థితులు మెరుగవుతాయి. అన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. మాసం చివరన కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. మంగళవారం సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించాలి. సుబ్రమణ్య కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.