Telugu Rasi Phalalu 2024 Monthly

simharasi సింహ రాశి

ఏప్రిల్ నెల రాశిఫలాలు 2023


ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహమున గాని ఉద్యోగమునా గాని స్థానచలనాలు తప్పవు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది. మాసం చివర ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. శివాలయంలో రుద్రాభిషేకం శనగలు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు.