Telugu Rasi Phalalu 2024 Monthly

tularasi తుల రాశి

ఏప్రిల్ నెల రాశిఫలాలు 2023


ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వీలైనంత వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల వలన ఊహించని సమస్యలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అంతగా కలిసి రావు మాసం చివరన సన్నిహితులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వినాయకునికి సింధూరం, గరిక గడ్డి సమర్పించాలి ఉలవలు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలను పొందుతారు.