Telugu Rasi Phalalu 2024 Monthly

vrushabarasi వృషభ రాశి

మార్చి నెల రాశిఫలాలు - 2023


ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగము ఉన్నతికి చేసే ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మాసం మధ్యనుండి జీవితభాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.