బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం
హైదరాబాద్ లోని బల్కం పేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శిస్తే భారత దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను సందర్శించినంత పుణ్యం వస్తుందని చెబుతారు. దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బల్కంపేట అమ్మవారి దర్శనం వల్ల అప్పటివరకూ చేసిన అన్ని పాపాలు పోతాయని చెబుతారు.
బల్కంపేట ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ప్రాంతం. అయితే పూర్వం ఇక్కడ నగరమే ఉండేది కాదు. ఇది ఒకగ్రామం. చుట్టూ అడవి, పంటచేలు మాత్రమే ఉండేవి. ఈ క్రమంలో ఒకరోజు ఒకరైతు తన పొలంలో బావిని తవ్వడానికి పనులు మొదలుపెట్టాడు.
కొంత లోతుకు తవ్విన తర్వాత అక్కడ పెద్ద బండరాయి అడ్డువచ్చింది. సునిశితంగా పరిశీలించిన తర్వాల ఆ బండరాయి అమ్మవారి ఆక`తితో కనిపించింది. దీంతో ఆ శిలకు భక్తి శ్రద్దలతో పూజచేసి మరో చోట ప్రతిష్టించడానికి సిద్ధమయ్యాడు.
అయితే ఆ శిల ఒక ఇంచు కూడా కదల లేదు. దీంతో గ్రామంలోని చాలా మందికి ఈ విషయం చెప్పి ఆ విగ్రహాన్ని వేరేచోట ప్రతిష్టింపజేయడనికి వందల మంది మనుష్యులను ఆ విగ్రహం వద్దకు తీసుకువచ్చారు.అయితే ఎంత ప్రయత్నించినా కూడా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించలేపోయారు. దీంతో దేవికి ఇక్కడే ఉండి పూజలు అందుకోవాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించడాన్ని విరమించారు.అంతేకాకుండా ఆ దేవికి రేణుకాదేవి అని పేరు పెట్టారు. అంతేకాకుండా రేణుకా యల్లమ్మ పేరుతో పూజలు కూడా చేసేవారు. మరోవైపు ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి అందరూ బయటే నిలబడిపూజించడం మొదలుపెట్టారు.కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ఈ దేవవతకు పేర వచ్చింది. ఈ క్రమంలోనే రేణుకా ఎల్లమ్మ దేవి మహిమలు చుట్టు పక్కల గ్రామాల వారు కూడా తండోపతండాలుగా వచ్చేవారు. అటు పై ఒక చిన్న దేవాలయాన్ని
ఇదిలా ఉండగా రాజా శివరాజ్ బహద్దూర్ అనే జమిందారు ఈ దేవలయం అభివ`ద్ధికి అనేక రకాలుగా పాటుపడ్డారు. ఈ విషయం హైదరాబాద్ చరిత్రకు సంబంధిచిన అనేక పుస్తకాల్లో లభ్యమవుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయంలో పాటు ఈ ప్రాంతం అభివ`ద్ధికి బెహలూఖాన్ వ్యక్తిని నిర్వహణాధికారిగా నియమిస్తాడు.
దీంతో ఈ ప్రాంతాన్ని బెహలూఖాన్ పేటగా పిచేవారు. అదే కాలక్రమంలో బల్కంపేటగా మారిపోయింది. అటు పై ఈ దేవతను బెల్కంపేట ఎల్లమ్మగా పిలవడం మొదలుపెట్టారు. కాగా ఇక్కడ వెలిసిన మాతను మొదట హేమలాంబ అనే పేరుతో కూడా పిలిచేవారని చెబుతారు.హేమం అంటే బంగారం అని అర్థం. గ్రామీణ వ్యవహారిక బాషలో హేమలంబ కాస్త ఎల్లమ్మగా మారిపోయిందని కూడా విశ్లేషిస్తారు. ఇక రేణుక అనే పదాయానికి పుట్ట అని అర్థం. ఆ కాలంలో ఈ దేవాలయం చుట్టూ అనేక పుట్టలు ఉన్నట్లు చెబుతారు.ఇక దేవాలయం రాజగోపురం దక్షిణ దిశలో ఉంది. అదే విధంగా తూర్పు ముఖంగా మహాగణపతి ఉపాలయం కూడా ఇక్కడ ఉంది. ఇదే ప్రాంతంలో పోచమ్మదేవి పేరుతో మరో దేవాలయం కూడా ఉంది. ఈ పోచమ్మతల్లిని వధూవరులు పెళ్లిబట్టలతో సహా సందర్శించుకోవడం చాలా కాలంగా వస్తున్న ఆచారం.అంతేకాకుండా ఇక్కడ హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి ఈ దేవాలయంలో నాగదేవతను ప్రతిష్టించారు. ఇక్కడ నిత్యం నాగదోష, కాలసర్పదోష పూజలను నిర్వహిస్తారు. అంతేకాకుండా సుమారు 18 అడుగుల రాజరాజేశ్వరి దేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు.ప్రతి శుక్రవారం ఎల్లమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఇక ప్రతి ఏడాది ఆషాడ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ దేవి కళ్యాణోత్సవాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణోత్సవాన్ని చూడటానికి ముల్లోక దేవతలు ఇక్కడికి వస్తారని ప్రతీతి.
దేశవిదేశాల నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. అదే విధంగా రథోత్సవం కూడా ఇక్కడ కన్నుల పండువగా జరుగుతుంది. తెలంగాణ సంస్క`తి సంప్రదాయాలను ప్రతిబిబించేలా జానపథ న`త్యాలు, పాటలు, కచేరీలు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు.
ఈ యల్లమ్మ దేవి స్వయంభువు అన్న విషయం తెలిసిందే. ఈ విగ్రహం తల పై భాగం నుంచి నిత్యం జలధార వస్తూ ఉంటుంది. ఈ నీటిని భక్తులకు తీర్థంగా అందజేస్తారు. ఈ తీర్థాన్ని ఇంటికి తీసుకువెళ్లి చల్లుకొంటూ భూత, ప్రేత పిశాచాల బారి నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు.బావిలోపల అమ్మవారు లభించడం వల్ల అమ్మవారిని జలదుర్గా అని కూడా పిలుస్తారు. కొన్ని రోజుల క్రితమే ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబాని భార్యా నీతూ అంబాని ఎల్లమ్మ దేవిని సందర్శించుకొన్నారు. హైదరాబాద్ లోని అమీర్ పేట నుంచి ఈ బల్కం పేట అమ్మవారికి దేవాలయానికి నిత్యం ఆటోలు అందుబాటులో ఉంటాయి.