నవరత్నాలు, వాటి లాభాలు

ఈ నవరత్నాలలో ఏది ధరించినా అందులో దాగి వున్న కాశ్మిక్ శాక్తి ఆ మనిషిని అందించబడుతుంది. నవరత్నాలన్నీ కలిగిన నగలు ధరిస్తే అన్ని గ్రహాల ప్రభావాల నుండి మేలు పొందగలుగుతాడు. బంగారు సూర్యగ్రహ లోహం. అందుకే బంగారంలో ఈ నవరత్నాలను ధరించడం ఒక ఆరోగ్యకర అమర్గమనే నమ్మకం పెరిగింది. నవరత్నాలతో కూడిన నగలు తయారుచేయడం ఒక ప్రత్యేక కళగా రాజులు ప్రోత్సహించారు. ఆ నవగ్రహాలను ధరించుటమంటే ఆ గ్రహదేవతలందరికీ శాంతి చేయించటమే. ఆ దేవతల కరునా కటాక్షాలు శాశ్వతంగా ధరించే వారి మీద ఉంటాయి

నవరత్నాలు, ధరించవలసిన వారి నక్షత్రములు, లాభాలు
కెంపు Kempuimage కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ సమర్థప్రభువు. ఇది ధరించినవారికి ఆయుర్వృద్ధి, ధనలాభం, అధికారం, ఉన్నతస్థితి, రోగనివారణ, మనోవికాసం కలుగుతాయి. ఇది ఎరుపు రంగుతో బాలసూర్యుని వలె ప్రకాశిస్తుంటుంది. ధాన్యం, గోధుమలు, శుద్ధికి ఆవు పాలు, గంగాజలం, మంత్రం ఓం దృణిః సూర్యాయ నమః||
ముత్యం Mutyamimage రోహిణి, శ్రవణం, హస్తా గుణం రాణి. ఇది ధరించిన వారికీ, వివాహం కానివారికీ త్వరలో వివాహం జరగటం, కుటుంబ, దాంపత్యానుకూలత, స్త్రీసౌఖ్యం, కార్యసిద్ధి, సంపదలు, ధనధాన్యవృద్ధి, మేహశాంతి కలుగుతాయి. గుండె జబ్బు రాదు. స్త్రీల పాలిట కామధేనువు వంటిది. ముత్యాలు తెల్లగా, స్వయంగా మెరుస్తుంటాయి. ధాన్యంబియ్యం, శుద్ధికి సైంధవ లవణం, వరిపొట్టు (ధాన్యం పొట్టు). మంత్రం ఓం సోం సోమాయ నమః||
పగడం Pagadamimage మృగశిర, చిత్త, ధనిష్ట గుణం సేనానాయకుడు, ఉద్యమనాయకుడు. ఇది ధరించినవారికి శత్రుసంహారం, సాహసం, ధైర్యం చేకూరుతాయి. బుుణవిమోచనం, అధికారం, మాట చలాయింపు కలుగుతాయి. ఇది చిలుక ముక్కు రంగునూ, దొండ పండు రంగునూ పోలి ఉంటుంది. ధాన్యంకందులు. శుద్ధికి ఆవు పాలు, కంకుమ నీరు, రక్తచందనం నీరు. మంత్రం ఓం అం అంగారకాయ నమః||
పచ్చ Paccaimage ఆశ్లేష, రేవతి, జ్యేష్ట గుణం తన వ్యాపారాలు తాను చూసుకునే తెలివైనవాడు. ఇది ధరించినవారికి జ్ఞాపకశక్తి, బుద్ధి చాతుర్యం కలిగి, నరాల ఒత్తిడి తగ్గుతుంది. విషదోషాలు హరిస్తుంది. ఉన్మాదం, పిచ్చి, దృష్టిదోషాలను పోగొడుతుంది. ఇది నెమలి పింఛం, గరిక చిగుళ్ల రంగులలో ఉండును. శుద్ధికి ఆవు మజ్జిగ, గోమూత్రం, పసుపు నీరు. ధాన్యంపెసలు. మంత్రం ఓం భుం బుధాయ నమః||
పుష్యరాగం Pusyaragamimage పునర్వసు, విశాఖ, పూర్వాబాద్ర గుణం తన మేధాశక్తితో ఇతరులకు మేలు చేసే ఆదర్శవాది. ఇది ధరించినవారికి బుుణవిమోచనం, శత్రుజయం, ఉద్రేకం, ఆందోళన, తగ్గడం, పుత్రసంతానం, వంశవృద్ధి కలుగుతాయి. దీని రంగు బంగారు. లేత గులాబీ రంగులో ఉంటాయి. ధాన్యంసెనగలు శుద్ధికి ఉలువల గంజి, సెనగలు, ఉడికించిన నీరు. మంత్రం ఓం బృహస్పతయ నమః||
వజ్రం Vajramimage భరణీ, పుబ్బ, పూర్వాషాడ గుణం తన మేధాశక్తితో తాను వృద్ధి చెందేవాడు. ఇది ధరించినవారికి నూతనతేజస్సు, కళ, ధన ధాన్యసంపదలు సంసారజీవితంలో అనుకూలత, సుఖం, స్త్రీలకు సుఖప్రసవం కలుగుతాయి. కలరా, ప్లేగు వ్యాధులు రావు. ఇది సహజమైన కాంతితో తేలికగానూ. తీర్చిన కోణాలతోనూ అందంగా కనిపిస్తుంది. ధాన్యంబొబ్బర్లు. శుద్ధికి ఆవు పాలు, బియ్యం కడిగిన నీరు, బొబ్బర్లు ఉడికించిన నీరు, మంత్రం ఓం శుం శుక్రాయనమః||
నీలం Nīlamimage పుష్యమి, ఉత్తరాభాద్ర, అనూరాధ గుణం ఇతరుల ఆలోచనను ఆచరణలో పెట్టేవాడు. ఇది ధరించినవారికి అపమృత్యు దోషాలు పోవటం, సంఘంలో గౌరవం, పలుకుబడి, ధనలాభం కలుగుతాయి. శని దోషాలు యావత్తూ తొలగును. ఇవి 3 రకాలు 1. ఇంద్రనీలం, 2. మహానీలం, 3. నీలమణి. ఇది నల్లని రంగు, నీలి ఆకాశం రంగు, నెమలి కంఠం రంగులతో ఉంటుంది. ధాన్యంనల్ల నువ్వులు, శుద్ధికి నల్ల నువ్వుల నూనె, నీలిచెట్టు ఆకుల రసం, నల్ల ద్రాక్ష రసం. మంత్రం ఓం శం శనైశ్చరాయనమః||
గోమేదికం Gomedikamimage ఆరుద్ర, స్వాతి ,శతభిషం గుణం ఆశాపరుడు, ఇది ధరించినవారికి నష్టద్రవ్యలాభం, స్త్రీమూలంగా సహాయం, లాభం, వశీకరణ కలుగుతాయి, ఆవేదన తగ్గుతుంది. ఈ రాయి సహజమైన గోమూత్రవర్ణం కలిగి ప్రకాశిస్తూ వుంటుంది. ధాన్యంమినుములు, శుద్ధికి మాదీఫలరసం, తేనే, గోమూత్రం. మంత్రం ఓం ఐం హ్రీం రాహవే నమః||
వైడూర్యం vaiduryamimage అశ్వని,మఖ, మూల గుణం నిరాశాపరుడు. ఇది ధరించినవారికి శత్రు బాధ నశించి, దుష్టగ్రహపీడలు తొలగుతాయి. ఉత్సాహం, యోచన, లాభం కలుగుతాయి. గర్భిణులు ధరిస్తే సుఖ ప్రసవం అవుతుంది. కష్టాల నుండి రక్షిస్తుంది. ఈ రాయి పై భాగం సన్నని నూలు దారంలా తిరుగుతుంది. వెలుతురులో పిల్లి కన్ను వలె ప్రకాశించును. ఇది లేత పచ్చ కలిసిన బూడిద వర్ణంతో ఉంటుంది. ధాన్యంఉలువలు. శుద్ధికి ఉలువలు ఉడికించిన గరికరస మిశ్రమం. మంత్రం ఓం ఐంహ్రీం కేతవే నమః||
adimage