పండ్లు మరియు ప్రయోజనాలు
1.Apple(ఆపిల్)
కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచుపదార్థం యాపిల్స్‌లో ఎక్కువగా లభిస్తాయి. రోజుకు అవసరమైన పీచులో నలభై శాతం ఈ పండ్ల నుంచి లభిస్తుంది. పీచుపదార్థాలు ఎక్కువగా తినేవారిలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది.
2.Grapes(అంగూరలు )
ద్రాక్షలో శరీరానికి మేలు చేసే ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, సీ, బీ6లు ఉంటాయి. వీటితో పాటు గ్లూకోజ్, మెగ్నీషియం సిట్రిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి ద్రాక్ష పండ్లు బెస్ట్ ఆప్షన్.బ్లాక్ గ్రేప్స్‌లో ముఖ్యంగా ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి గుండెలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి కండరాలకు మేలు జరుగుతుంది. దీని వల్ల గుండె సమస్యలు దూరం అవుతాయి. ద్రాక్షలు తినడం వల్ల రక్తంలోని నైట్రిన్ ఆక్సైడ్ పెరుగుతంది. ఇది రక్తం గడ్డలు కట్టకుండా నివారిస్తాయి. దీంతో గుండెకి మేలు జరుగుతుంది.బ్లాక్ గ్రేప్స్‌ని రెగ్యులర్‌గా తినడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుంది.
3.Pomegranates(దానిమ్మ)
దానిమ్మ మెదడులో వాపును తగ్గించడంతో పాటు ఆల్జీమర్స్ ను నియంత్రిస్తుంది. విటమిన్ C, K కాకుండా రకరకాల పోషకాలతో నిండిన దానిమ్మ శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది.
4.Banana(అరటి )
ఏడాది పొడవునా దొరికే అరటి పండు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, సహజ చక్కెరలు తక్షణం శరీరానికి అందుతాయి. అరటిపండులో పీచు పదార్థాల మోతాదు కూడా ఎక్కువగా వుంటుంది. రక్తపోటును తగ్గించే పొటాషియం అత్తి, అరటిపండ్లలో లభిస్తుంది.
5.Papaya(బొప్పాయి)
బొప్పాయి, బీటా క్రిపొక్సాంథిన్ గుణాలు ఎక్కువగా వుంటాయి. ఇవి లంగ్ క్యాన్సర్ దరిచేరకుండా కాపాడతాయి. బొప్పాయిలోని పపెయిన్ ఎంజైమ్ జీర్ణశక్తికి సహకరిస్తుంది. అజీర్తితో బాధపడేవారికి బొప్పాయి దివ్యౌషధం. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి.
6.Cherry fruits(చెర్రీ పండ్లు)
చెర్రీ పండ్లలో విటమిన్ సి, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు, చెర్రీలో అనేక రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇది శరీరంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులకు కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.చెర్రీస్ గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. గర్భధారణ సమయంలో చెర్రీస్ తీసుకుంటే.. ఇది శిశువు అభివృద్ధిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.మెలటోనిన్, ఆంథోసైనిన్ చెర్రీస్‌లో కనిపిస్తాయి. ఇవి నిద్రను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. చెర్రీలో స్థూలకాయం నిరోధక ప్రభావం ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
7.Guava(జామ)
తక్కువ ధరకే దొరికే ఒక కప్పు జామపండు ముక్కల్లో లభించే విటమిన్ సి రోజువారీ అవసరాని కంటే ఐదు రెట్లు ఎక్కువ వుంటుంది. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్ వంటివి మెండుగా ఉన్నాయి. జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటుంది.
8.Orange(నారింజ)
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినే మహిళల్లో చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు మిగతా వారి కంటే తక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి కూడా కమలా పండ్ల నుంచి లభిస్తుంది.
9.Berry(నేరేడు)
సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే మంచిది. అలా ప్రకృతి ప్రసాదితమైనది నేరేడు. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని. అనారోగ్యాల నివారణి. విటమిన్లు, క్రోమియం నేరేడులో పుష్కలంగా ఉంటాయి.
10.Mango(మామిడి)
మామిడిలో ఉండే విటమిన్-C, ఫైబర్ శరీరానికి హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. మామిడి పండ్లలో ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మామిడి పండ్లు మంచి ఔషదం కూడా.మామిడి పండ్లలో ఉండే కాపర్ వల్ల ఎర్ర రక్తకణాల వృద్ధి చెందుతాయి.మామిడి పండ్లలో విటమిన్-C తోపాటు విటమిన్ A, విటమిన్ B6, విటమిన్ K, ప్రోటీన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఉంటాయి. వీటి వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు దరి చేరవు.
11.Sapota(సపోట)
ఫ్రక్టోజ్, సుక్రోజ్, షుగర్ కంటెంట్ పుష్కలంగా దొరుకుతాయి,ఫోలేట్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, మినరల్స్, విటమిన్స్( విటమిన్-A,C) వంటి పోషక పదార్థలు ఉంటాయి.
12.Watermelon(పుచ్చకాయ)
పుచ్చకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది. క్యాలరీలు తక్కువగా, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్-A, B1, B6, C, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, బయోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.
13.Pineapple(అనాస)
పైనాపిల్‌లో నీరు 87.8 గ్రాములు (ప్రతి 100 గ్రాముల పండులో), ప్రొటీన్ 0.4 మి.గ్రా, కొవ్వు 0.1 మి.గ్రా, పిండి పదార్థం 10.8 మి.గ్రా, కాల్షియం 20 మి.గ్రా, పాస్పరస్ 9 మి.గ్రా, ఐరన్ 2.4 మి.గ్రా, సోడియం 34.7 మి.గ్రా, పొటాషియం 37 మి.గ్రా, మాంగనీస్ 0.56 మి.గ్రా, కెరోటిన్ 18 మైక్రోగ్రాములు, శక్తి 46 కిలో కాలరీలు ఉంటాయి.పైనాపిల్‌లో 'సి' విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి.పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది.పైనాపిల్ రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది.పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.
14.Muskmelon(ఖర్బూజ)
ఇందులో 95 శాతం నీళ్లుంటాయి. విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. వేసవిలో ఆరోగ్యానికి మంచిది. ఖర్బూజ తింటే..ఛాతీలో మంట తగ్గుతుంది. మూత్రాశయంలోని మలినాలు శుభ్రమౌతాయి. ఇందులో షుగర్, కేలరీలు ఎక్కువ మోతాదులో ఉండనందున..డయాబెటిస్ రోగులకు కూడా మంచిది. బరువు తగ్గించుకోవాలనుకునేవారు ఆకలిగా ఉన్నప్పుడు ఖర్బూజ తినడం ప్రయోజనకరం. గుండె సంబంధిత వ్యాధులే కాకుండా కేన్సర్ వ్యాధిని నియంత్రణలో కూడా ఖర్బూజ దోహదపడుతుంది. కార్బోహైడ్రేట్ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు చర్మాన్ని కూడా కాపాడుతుంది. అంతేకాదు ఖర్బూజలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల అధిక బరువున్నవాళ్లు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులో ఉండే ఫైబర్..కొద్దిగా తినగానే కడుపు నిండిన అనుభూతి కల్పిస్తుంది. అతి ఆకలిని నివారిస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఖర్బూజ కీలకంగా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది కేన్సర్ నివారణలో అవసరమైన రక్షణను అందిస్తుంది. విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు కేన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తిప్పికొట్టడంలో సహాయపడతాయి. ఫలితంగా శరీర కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.ఖర్బూజ క్రమం తప్పకుండా తింటే..శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.
15.Jack fruit(పనసపండు)
పనసపండులో.. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇవి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా.. శరీరాన్ని రక్షిస్తాయి.పనసపండులో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది శరీరంలో సోయిడం సమతుల్యను నియంత్రిస్తుంది. శరీరంలో సోడియం స్థాయిలు పెరిగితే.. ధమనులు, గుండెకు హాని జరుగుతుంది. పొటాషియం గుండె కండరాల పనితీరును సమన్వయం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పనసపండులోని పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. పనసపండులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్‌తో పాటు మనకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి.పొటాషియం మూత్రపిండాల ద్వారా కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది. పనసపండు తింటే.. ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది.పనసపండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.పనసపండులో కాపర్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ జీవక్రియలో ముఖ్యంగా హార్మోన్ ఉత్పత్తి, శోషణలో సహాయపడుతుంది. దీనిలోని ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
16.Kiwi fruit(కివీ పండు)
కివీ పండులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. కెనడియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కివీ పండు తరచుగా తింటే.. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. కివీలోని విటమిన్ సీ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది వాపు, క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది.కివీ పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్ ఉంటుంది. ఈ ఫోలేట్ ఎముక నిర్మాణానికి తోడ్పుడుతుంది. ఎముకల గట్టితనానికి కివీలోని విటమిన్ కే కూడా బాగా సహాయపడుతుంది. కివిలో పెద్ద మొత్తంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. . విటమిన్ సి ఆస్తమా పేషెంట్స్‌లో శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ సీ శ్వాసకోశ వ్యవస్థలో అలెర్జీలకు కారణం అయ్యే.. ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.
17.dragon fruit( డ్రాగన్ పండు)
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి. ఈ పండు ఇన్సులిన్ రెస్టిసెన్స్‌ను పెంచుతుంది. డయాబెటిస్ లేని వారు, డ్రాగన్ ఫ్రూట్ తింటే.. షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.