శ్రీ గణపతి పంచాయతన ఆలయం- మెహిదీపట్నం

Sample Image

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని, మెహదీపట్నం, రింగురోడ్డుకు సమీపంలోని పద్మనాభ నగర్ లో శ్రీ గణపతి పంచాయతన దేవాలయం ఉంది.మన భారత దేశంలో ప్రసిద్ది చెందిన గణపతి ఆలయాల్లో ఒకటి సాక్షి గణపతి ఆలయం. ఈ ఆలయం శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీశైలంలో ప్రధాన దేవాలయం మల్లికార్జున స్వామి. అయితే ఈ ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంది. ఆ గణపతి శివ భక్తుల అఖండ భక్తికి శ్రీశైల యాత్రకు మొదటి సాక్షి.

ఆలయ ముఖద్వారంపై వినాయకుడు, షిర్డి సాయినాథుడు, కుబేర లక్ష్మీలు, గ్రామదేవత పోచమ్మతల్లి మొదలగు దేవతామూర్తులు ఉన్నారు. ప్రధానాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ఉంటుంది. అనేక చోట్ల శివపంచాయతన ఆలయాలు ఉంటాయి. కానీ ఇక్కడ గణపతి పంచాయతన ఆలయం ఉండుట చాలా అరుదు.

విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ ఆలయంలో గర్భాలయ ముందు భాగంలో స్వామి వాహనమైన మూషికం శిలా విగ్రహం దర్శన మిస్తుంది. గర్భాలయంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడు. స్వామిమూర్తికి ఇరువైపులా పరమేశ్వరుడు, పార్వతీదేవి, శ్రీమహావిష్ణువు, సూర్యదేవుడు దర్శనమిస్తారు.

ఈ ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ఆలయం ఉంది. ఈ ఆలయంలో సాయిబాబా విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి ఎదురు సాయినాధుని పాదాలు ఉంటాయి. సాయిబాబాను పంచామృతాలతోను, పుష్పాలతోను సేవిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో కుబేరలక్ష్మీ అమ్మవారికి ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది.

ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయస్వామి మందిరం ఉంది. శ్రీరామనవమి, హనుమజ్జయంతి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అశ్వత్థవృక్షం క్రింద మహేశ్వరశివలింగం ఉన్నది.

ఈ ఆలయ ప్రాంగణంలోనే పోచమ్మ తల్లికి కూడా మరో ఆలయం ఉన్నది. మొదటగా ఈ అమ్మవారే ఈ ప్రాంగణంలో వెలిశారని భక్తుల నమ్మకం.

ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయస్వామి మందిరం ఉంది. శ్రీరామనవమి, హనుమజ్జయంతి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అశ్వత్థవృక్షం క్రింద మహేశ్వరశివలింగం ఉన్నది.