శ్రీ శక్తి గణపతి ఆలయం- రామకోటి
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని రామకోఠి ప్రాంతంలో శ్రీ శక్తి గణపతి ఆలయం ఉన్నది. ఈ ఆలయంలోగల వినాయకుడు శాంతస్వరూపం, చతుర్భుజాలు, అగ్రపూజ్యత్వం, విఘ్నాలను తొలగించేవాడుగా ఈ శక్తి గణపతి భక్తులను రక్షిస్తున్నాడని భక్తుల నమ్మకం.
ఈ ఆలయంలో గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నవరాత్రులలో లక్ష పుష్పాలతో సువర్ణపుష్ప గణపతి, కోదండరామ గణపతి, వేంకటేశ్వర గణపతి, ఫల గణపతి, లక్ష్మీ నరసింహ గణపతి, మహారాజ గణపతి, దక్షోజనం గణపతి, రాధాకృష్ణ గణపతి వివిధ రూపాలతో స్వామి అలంకారాలను నిర్వహిస్తారు.
ఈ ఆలయంలో ఉన్న స్వామివారికి అర్చన, అభిషేకం, పాలాభిషేకం, మాసనిత్యార్చన, పుష్పకావిడి, గణపతి వ్రత పూజ, సహస్రనామార్చన, మూలమంత్ర అర్చన, హోమం, నిజరూప దర్శనం, గణపతి మోదకపూజ, షోడశ గణపతి పూజ, శాశ్వత అభిషేకం, నిత్యార్చనలు జరుగును.