కాణిపాకం వినాయకడి ఆలయం

Sample Image

తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం. ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు.మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయచరిత్ర నిజానిజాలేంటో మీకు తెలుసా? తెలుసు కానీ అంత వివరంగా తెలీదు కదా. మరెందుకాలస్యం ఆ కాణిపాకం వినాయకుని గూర్చి వివరంగా తెలుసుకుందాం.

హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్టించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు.

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.

1. కాణిపాకం

కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా వుంటుంది. కానీ కాణిపాకం గుడి వున్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయభూమి.

2. బావి

కొద్దిరోజులకు వారు వ్యవసాయభూమిలో నీరెండిపోవటం గమనించారు. బావిని ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇంకొద్దిగా తవ్వితే నీరోస్తాయని తవ్వటం మొదలెట్టారు. అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం వూరటం మొదలైంది. కొద్దికొద్దిగా బావి నిండుతుంది.

3. కొబ్బరికాయల నీరు

ముగ్గురన్నదమ్ములూ ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్థులకు తెలిసి పూజించటం మొదలెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకం అంత విస్తీర్ణం పాకింది.

4. విగ్రహం

దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళపేరొచ్చింది. అదే వాడుకలోకొచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది. ఈ ఆలయాన్ని 11 వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. రోజురోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత. ఇప్పటికీ విగ్రహం బయట పడిన బావిలోనే వుంది.

5. బావి నీరు

మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు. అందుకే ఆ బావి నీటినే పరమపవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయముంది. అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారుపేరు.

6.చుట్టుపక్కల గ్రామాలు

ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పోప్పుకుంటారని ప్రసిద్ది. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కి.మీ ల దూరంలో వుంది.

7. తిరుమల తిరుపతి

ఇక తిరుమల తిరుపతికి చాలా దగ్గర. కాబట్టి వీలు చిక్కినప్పుడల్లా దర్శించుకుంటూ వుండండి. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

8. దర్శనీయ దేవాలయాలు

కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి.వరసిద్ది వినాయకుని ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు,ఒక విన్నూతమైన మండపం ఉన్నాయి. శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం వుంది. షణ్ముఖ,దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి.

9. కుళొత్తుంగ మహారాజు

ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం తిరుగుతూ వుంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.

10. శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం

శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం వుంది. పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. కాణిపాకంలో ప్రసిద్దమైన ఆంజనేయస్వామి గుడి కూడా వుంది.

11. అద్దాల మేడ

వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాలమండపం, అద్దాల మేడ కూడా వుంది. ఈ ఊరు మూడవవంతు (3/4 వంతు) వివిధ దేవాలయములతో నిండి వుంది.

12. ఇతర విశేషాలు

ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం."బ్రహ్మహత్యా పాతక నివృత్తి" కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది.

13. వరసిద్ది వినాయక ఆలయం

ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి.

14. ఆలయ ప్రాంగణం

వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.