నరముఖ గణేశ ఆలయం
నరముఖ గణేశ తమిళనాడులోని తిలతర్పన్‌పురి సమీపంలోని ముక్తేశ్వర ఆలయంలో ఉంది. దీనిని ఆది వినాయక దేవాలయం అని కూడా అంటారు. మానవుని ముఖం కారణంగా ఈ ఆది వినాయకుని దివ్య రూపాన్ని 'నర ముఖ' వినాయకుడు అని కూడా అంటారు. ఇది గణేశుడి దివ్య రూపం. ప్రసిద్ధ గజాననుడి అరుదైన రూపాన్ని కలిగి ఉన్న ఏకైక ఆలయం.
అష్టవినాయక దేవాలయలాల సమూహంలో ఐదవ దేవాలయంగా సూచించబడినప్పటికీ, యాత్రికులు మోర్గావ్ తర్వాత సమూహంలో రెండవ స్థానంలో ఉన్న థేర్ దేవాలయాన్ని తరచుగా సందర్శిస్తుంటారు.
పురాణం:
రాముడు దశరథ రాజుకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో.. అతను ప్రార్థన చేసిన ప్రతిసారీ, అతని ముందు ఉంచిన పిండాలు పురుగులుగా మారాయి. దీంతో విసుగు చెందిన రాముడు శివుడిని ప్రార్థించాడు. మంథరవనానికి అంటే ఈ తిలతర్పణపురికి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేయమని శివుడు రాముడికి సలహా ఇచ్చాడట. రాముడు ఈ ఆలయాన్ని సందర్శించి, తన తండ్రి దశరథుని ఆత్మ కు మోక్షాన్ని కలిగించమని పూజ చేశాడు. అతనికి ఆశ్చర్యం కలిగించే విధంగా నాలుగు పిండాలు నాలుగు లింగాలుగా మారాయి. ఈ లింగాలు ఇక్కడ ఆది వినాయక ఆలయానికి సమీపంలో ఉన్న ముక్తేశ్వరాలయంలో ప్రతిష్టించబడ్డాయి.
నేటికీ భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి 'పితృ దోషం' నుండి విముక్తి కోసం ప్రార్థనలు చేస్తారు. తిలతర్పణపురి అనే పేరే ఇది పూర్వీకులు తర్పణం విడిచిపెట్టిన ప్రదేశం అని సూచిస్తుంది.