పప్పు ధాన్యాలు మరియు ప్రయోజనాలు

Sample Image

1. శనగ పప్పు

శనగలలో కొవ్వు శాతం తక్కువగా ఉండి, ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తాయి. రెగ్యులర్‌గా తినడం వల్ల వారికి నాన్‌వెజిటేరియన్స్ పొందే అనేక లాభాలన్నీ పొందొచ్చు.100 గ్రాముల ఉడికించిన శనగలలో 9 గ్రాముల ప్రొటీన్, 8 గ్రాముల ఆహార ఫైబర్ ఉంటుంది. యునైటడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదికల ప్రకారం కొలెస్ట్రాల్ అసలు ఉండదు. అయితే, మాములుగా అయితే, 2.6గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది, ఐరన్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉంటాయి. 164 కేలరీలతో ఈ శనగలతో చేసే వంటకం బానే కడుపు నింపుతుంది కూడా.ఎక్కువగా ప్రొటీన్, పీచుపదార్థం ఉండటం అంటే శనగలు బరువు తగ్గడానికి సరిపడే ఆహారమని అర్థం.శనగల్లోని పీచుపదార్థం రక్తంలోని చక్కెరస్థాయిని, కొవ్వుల స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను కూడా మెరుగ్గా నియంత్రించటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎక్కువ పీచుపదార్థాలు ఉన్న ఆహారం వల్ల డయాబెటిస్,రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వంటి రిస్కులు తగ్గుతాయి. శనగలు ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తాయి. ఎందుకంటే వీటిల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అలాగే విటమిన్ కె వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి.శనగల్లో ఉండే విటమిన్ బి9 లేదా ఫోలేట్ మెదడు, కండరాల సరైన అభివృద్ధికి అలాగే నాడీవ్యవస్థ చక్కగా పనిచేయటానికి, సరైన మెటబాలిజం వంటివాటికి ఉపయోగపడుతుంది.శనగలలో పీచుపదార్థం ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది.

2. కందిపప్పు

కంది పప్పులో ప్రొటీన్, ఫైబర్ పుష్కలం గా ఉంటాయి. దాంతో పాటూ అందులో కొలెస్ట్రాల్, సాచ్యురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటాయి. ప్రొటీన్ మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టైతే, ఫైబర్ బాడీ లోనించి కొలెస్ట్రాల్ ని బైటికి పంపెయ్యడంలో సహాయం చేస్తుంది. పైగా ఇది తినాక తొందరగా ఆకలి గా కూడా అనిపించదు. కంది పప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. అందువల్ల దీన్ని డయాబెటిక్స్ కూడా హాయిగా తినచ్చు. ఇందులో ఉండే ఫైబర్ వల్ల బ్లోటింగ్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కంది పప్పులో ఉండే బీ కాంప్లెక్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం వల్ల దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. కంది పప్పు తో ముద్దపప్పు, కంది పచ్చడి, కంది పొడి లాంటి వంటకాలు ఈజీగా చెయ్యచ్చు. పైగా కంది పప్పు కి ఉన్న రుచి ఇంకే పప్పుకీ ఉండదు. అందుకని రుచికరం గా తింటూ మరీ బరువు తగ్గచ్చు.

3. పెసర పప్పు

పెసర పప్పు, లేదా పెసలు ప్రొటీన్ తో సమృద్ధమైనవి. దాంతో పాటూ అందులో ఉండే ఫైబర్ అధిక బరువు ఉన్న వారికి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ పప్పు చాలా సేపటి వరకూ ఆకలి కలగనీయదు. అందుకే పెసరట్టుని బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అంటారు. అయితే, అది ఉప్మా తో కలిపి తినకపోతేనే. పెసర పప్పు తో చేసే కిచిడీ పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ గా తినచ్చు, లేదా రాత్రి డిన్నర్ గా కూడా తినచ్చు. రాత్రి పూట కేవలం పెసర పప్పు కిచిడీ తింటూ బరువు తగ్గడం కూడా సాధ్యమే. మొలకెత్తిన పెసల్ని స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. పెసర పప్పు ముద్ద పప్పు, పెసరట్టు, పెసర మొలకలు, కిచిడీ, పెసర పునుగులు, పెసరపప్పు హల్వా, బర్ఫీ (బెల్లం వాడాలి, పంచదార బదులు) ఈ పప్పు బ్రేక్ ఫాస్ట్ నించీ డిన్నర్ వరకూ ఎలా అయినా తినచ్చు.

4 మినప్పప్పు

మినప్పప్పు లో ఉన్న ఫైబర్ వలన కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. మినప్పప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. మినప్పప్పుతో చేసిన ఆహారం తిన్నాక బింజ్-ఈటింగ్ వైపు మనసు పోదు. ఇందులో ఉన్న ఫోలిక్ ఆసిడ్ వలన ప్రెగ్నెంట్స్ కూడా ఈ పప్పుని నిరభ్యంతరం గా తినచ్చు. ఇందులెఒ ఉండే ఐరన్ వల్ల ఆక్సిజెన్ శరీరానికంతటికీ అందుతుంది. దాంతో చురుకుదనం పెరుగుతుంది. అది సహజంగానే బరువు తగ్గడానికి దారి తీస్తుంది.

5. ఎర్ర కంది పప్పు

కంది పప్పు తో పాటే చెప్పుకోవలసింది ఎర్ర కంది పప్పు. మసూర్ దాల్ పేరుతో సూపర్ మార్కెట్స్ లో దొరికె ఈ ఎర్ర కందిపప్పు కార్బో హైడ్రేట్స్ తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు మసూర్ దాల్ లో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. ఈ పప్పు తిన్నాక చాలా సేపటి వరకూ పొట్ట నిండుగా ఉండి త్వరగా ఇంకేమీ తినాలనిపించదు. ఇందులో ఉండే ప్రొటీన్, ఎసెన్షియల్ ఎమైనో ఆసిడ్స్, విటమిన్ బీ 1 అన్నీ బరువు తగ్గడానికి సహకరిస్తాయి. పొట్టు తీయని హోల్ మసూర్ దాల్ కూడా ఇందుకు ఉపకరిస్తుంది.

6. కిడ్నీ బీన్స్ (రాజ్మా)

రాజ్మా అని సాధారణంగా పిలవబడే వీటికి ఉన్న మరోపేరు కిడ్నీబీన్స్. దీని శాస్త్రీయ నామం ఫాసియోలస్ వల్గారిస్ అని చెప్పబడింది. ఫైబర్, కాల్షియం, సోడియం మరియు వివిధ ఇతర పోషకాలతో కూడుకుని ఉన్నందువలన కిడ్నీ బీన్స్ బరువు తగ్గడంలో కూడా ఉత్తమంగా సహాయం చేయగలదని చెప్పబడింది. కిడ్నీ బీన్స్లో ఉండే ఫైబర్ కంటెంట్ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించేలా సహాయపడుతుంది. కిడ్నీ బీన్స్ తరచుగా తీసుకోవడం మూలంగా క్యాన్సర్, లివర్ వ్యాధుల ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఇవి జీర్ణక్రియలను మెరుగుపరిచే, ఎముకలు మరియు దంతాలు ఏర్పడటానికి, చర్మ ఆరోగ్యం మరియు జుట్టు నాణ్యత కోసం ప్రయోజనకరంగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ నిక్షేపాలు అధికంగా ఉన్న కారణంగా గర్భిణీ స్త్రీలకు కిడ్నీ బీన్స్ అత్యంత ఉత్తమమైన పోషకాహారంగా చెప్పబడుతుంది. అలాగే, ఇవి హైపర్ టెన్షన్ ను నివారించడంలో, జ్ఞాపక శక్తికి మరియు డీటాక్సిఫికేషన్ కోసం సహాయపడతాయి.

7.అలసందలు లేదా బొబ్బర్లు

శాస్త్రీయంగా వీటిని విజ్ఞ ఉంగిక్యులతగా వ్యవహరించబడుతుంది. లెగ్యూమ్స్ కుటుంబంలో అత్యంత లాభదాయకమైన మరియు పుష్టికరమైన దినుసుగా పరిగణించబడుతుంది. ఇది ప్రోటీన్, పీచు, ఇనుము, భాస్వరం వంటి ఖనిజాలకు మంచి మూలంగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో ఈ అలసందలను చేర్చడం వల్ల మీ దేహానికి అత్యంత లాభదాయకమైన పౌష్టికాహారాన్ని అందించగలిగిన వారవుతారు, క్రమంగా శారీరిక బలాన్ని పెంపొందించడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా, ఈ అలసందలు శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గించడానికి మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతూ అనీమియా నివారించడంలో మరియు మీ చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉత్తమంగా దోహదపడుతుంది మరియు మీ చర్మం, జుట్టు మరియు కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీని కూడా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా మీ ఎముక బలాన్ని పెంచుతుంది.

8. మసూరి పప్పు

పోషకాలు మరియు ప్రోటీన్ల చౌక వనరుగా మసూరి పప్పు ఉంటుంది. దీనిని లెన్స్ క్యులినారిస్ అని శాస్త్రీయంగా పేర్కొనడం జరుగుతుంది. ఇవి పీచు, ఇనుము, మెగ్నీషియంలలో సమృద్ధిగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఈ దినుసులు అధికమైన పోషకాల గనిగా ఉంటుంది. వీటిని తరచుగా నియంత్రిత వినియోగంలో ఆహార ప్రణాళికలో జోడించుకోవడం మూలంగా క్యాన్సర్ ఆగమనాన్ని నిరోధించడానికి ఉత్తమంగా సహాయపడుతుంది. ఫ్లేవోనాల్స్ మరియు ప్రోసైయానిడిన్ వంటి పాలీఫెనోల్స్ ఉత్తమమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి, నాడీ మండలం సవ్యంగా పనిచేసేలా దోహదపడుతాయి. ఐరన్ అద్భుతమైన మూలంగా ఉన్న కారణాన అలసటతో పోరాడటానికి కూడా సహాయపడతాయి. అంతేకాకుండా, కండరాలు మరియు కణాల నిర్మాణానికి సహాయపడుతుంది. మరియు గర్భిణీ స్త్రీలకు మంచి పోషకాహారంగా కూడా ఉంటుంది. ఇది మీ శరీరంలోని ఎలక్ట్రోలైట్ యాక్టివిటీని పెంచుతూ, మీ ఎనర్జీ లెవల్స్ సరిగ్గా ఉండేలా దోహదపడుతుంది.

9. కాబూలీ దాల్

ఇవి అలసందల వంటి పప్పు. ఇవి పప్పుల్లో చాలా వెరైటీ గా ఉంటాయి. ఇందులో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల హీమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది.

10.ఉద్దిపప్పు

మీ ఆహారంలో పుష్కలమైన ప్రోటీనులు పొందాలంటే, ఉద్దిపప్పును తప్పనిసరిగా చేర్చుకోవాల్సిందే. ఇది ప్రోటీన్స్ మరియు విటమిన్ బి పుష్కలంగా కలిగిన ఒక అద్భుతమైన పప్పు ధాన్యం.

11. తూర్ దాల్

కందిపప్పు. పప్పుల్లో ఇది బాగా ప్రసిద్ది చెందిన పప్పు. ఇండియాలో వీటిని ఎక్కువగా తింటారు. ఇది కాంప్లెక్స్ డైటరీని పుష్కలంగా అంధిస్తుంది . మరియు బౌల్ మూమెంట్ క్రమబద్దం చేస్తుంది.

12.లోబియా దాల్

తెల్లని, చిన్నగా ఉండే అలసందలు. ఇందులో ప్రోటీనులు మరియు జింక్ అధికం.అలసందల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది. ప్రేగు కదలికలు మెరుగ్గా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వీటిలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.దీని వల్ల కంటి చూపు మెరుగ్గా చేసే విటమిన్ పుష్కలంగా ఉంది. ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

13.సోయా దాల్

థైరాయిడ్ సమస్యలు రెండు రకాలు.. ఒకటి హైపో థైరాయిడిజం. అంటే థైరాయిడ్ గ్రంథి బలహీనంగా పనిచేయడం. రెండోది హైపర్ థైరాయిడిజం. అంటే ఎక్కువగా థైరాయిడ్ పనిచేసే స్థితి. ఈ సమస్య ఎక్కువ స్త్రీలలోనే కనిపిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ ముందు, ఆ తర్వాత దశల్లో ఈ సమస్య వస్తుంది. అయితే, ఈ సమస్యను సోయా తినడం ద్వారా తదగ్గించవచ్చని పలు పరిశోధనలు చెబుతున్నాయి. సోయాతో చేసిన వంటకాలలో ఎక్కువగా ప్రొటీన్ ఉంటుంది,ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తాయి.