కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం

Sample Image

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆంజనేయ స్వామికి అంకితం చేయబడిన ఆలయం . ఇది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా , మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి . ఇది జగిత్యాల నుండి 15 కి.మీ , కరీంనగర్ నుండి 35 కి.మీ.ల దూరంలో ఉంది .

కొండగట్టు అంజన్నది విభిన్న రూపం ఒకవైపు నారసింహుడి మొహం ఉండగా మరోవైపు ఆంజనేయుడి మొహం ఉంటుంది. ఈయన్ను ఇక్కడ స్వయంభువుగా పేర్కొంటారు. కోరిన కోర్కెలన్నీ తీరుస్తాడని తెలంగాణ వాసులు నమ్ముతారు. ముఖ్యంగా సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తే ఫలితం ఉంటుందని చెబుతారు. అందువల్లే మంగళ, శనివారాల్లో ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు.

తెలంగాణలో పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు కూడా ఒకటి. ఇది కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలం కేంద్రంలోని ముత్యం పేట గ్రామానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది జిల్లాలోని జగిత్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్థానికుల కథనం ప్రకారం ఈ గుడిలో 40 రోజుల పాటు పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.అందువల్లే ప్రతి మంగళ, శనివారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఈ దేవాలయానికి పురాణ ప్రాధాన్యత ఉంది. పూర్వం రామ రావణుడు యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు కొద్ది సేపు మూర్చపోతాడు.ఆ సమయంలో సంజీవని తేవడానికి హనుమంతుడు వెలుతారు. సంజీవని మూలికలు దొరక్కపోవడంతో ఆ మూలికలు ఉన్న పర్వతం మొత్తాన్ని పెకిలించుకొని లంకకు తిరుగు ప్రయాణమవుతాడు.మార్గమధ్యంలో ఆ పర్వతం లోని కొంత భాగం కిందికి పడుతుంది. అలా పడిన క్షేత్రమే కొండగట్టుగా రూపాంతరం చెందిందని చెబుతారు.ఇక ఇక్కడ హనుమంతుడు నారసింహస్వామి ముఖంతో పాటు ఆంజనేయుడి ముఖం కలిగి ఉంటాడు. ఇలా రెండు ముఖాలతో ఆంజనేయస్వామి కనిపించడం భారత దేశంలోనేకాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదని చెబుతారు.అదే విధంగా విగ్రహంలో శంఖు, చక్రాలతో పాటు హ`దయంలో సీతారాములను కలిగి ఉండటం విశేషంగా ఇక్కడి గ్రామస్థులు చెబుతారు. అందువల్లే ఈ రూపాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.ఆ ఆవును వెదుకుతూ సొమ్మసిల్లి ఒక చెట్టు నీడన పడుకొంటాడు. కలలో ఆంజనేయస్వామి కనిపించి నేనిక్కడే కోరంద పొదలో ఉన్నానని చెబుతాడు.అంతేకాకుండా తనకు ఒక దేవాలయాన్ని కూడా నిర్మించాలని సూచిస్తాడు. దీంతో సంజీవుడు ఉలిక్కిపడి లేచి కలలో ఆ ఆంజనేయస్వామి తెలిపిన వివరాల ప్రకారం వెదుకగా శంఖు, చక్ర, గదాలంకరణతో ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారు దర్శనమిచ్చారు.విశ్వరూపమైన పంచముఖాల్లో ఒకటైన నారసింహ స్వామి మొహం ఒకవైపు ఉండగా ఆంజనేయ స్వామి మొహం మరోవైపున ఉంది. ఇంతలో తప్పిపోయిన ఆవు ఒకటి తనంత తానుగా ఇక్కడకు పరుగెత్తుకు వచ్చింది.దీంతో సంతోషించిన ఆ సింగం సంజీవుడు తన పరివారంతో కలిసి చిన్న దేవాలయన్ని నిర్మించారు. అక్కడే తనకు తోచిన రీతిలో ధూప ధీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించేవారు.స్వామివారి విభిన్న రూపంతో పాటు కోరిన కోర్కెలు తీరుస్తూ ఉండటం వల్ల ఈ దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుత దేవాలయాన్ని 160 ఏళ్ల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్‌ కట్టించాడు.

హైదరాబాద్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంది. అలాగే జగిత్యాల నుంచి కూడా ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సౌకర్యాలు ఉన్నాయి.ఈ దేవాలయం దగ్గర్లో మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బొజ్జ పోతన గుహలు భేతాలుడి ఆలయం, పులిగడ్డ బావి, కొండలరాయుని గట్టు తదితర దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి.

చరిత్ర

జానపద కథల ప్రకారం, ఈ ఆలయాన్ని సుమారు 300 సంవత్సరాల క్రితం ఒక గోరక్షకుడు నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్‌ముఖ్ పునరుద్ధరించారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత ఆంజనేయ స్వామితో పాటుగా వేంకటేశ్వరుడు , ఆళ్వారుల మరియు లక్ష్మీ దేవి విగ్రహాలు కూడా ఉన్నాయి.

సంతానం లేనివారు ఈ ఆలయంలో 40 రోజులు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం మరియు మానసిక వైకల్యం లేదా ఇతర అనారోగ్య వ్యాధులు ఉన్నవారు 40 రోజులు ఇక్కడ పూజ చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. దేవాలయం, అప్పుడు వారు నయం అవుతారు.