ఆకు కూరలు మరియు ప్రయోజనాలు

Sample Image

1. బచ్చలి కూర

ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమమైన స్థానం ఉంది. ఇది తెలీని వాళ్లు అంటూ ఉండరు. దీనిలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రక్తహీనత (నియోనియా) సమస్య తగ్గుతుంది.ఇందులో సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి మంచిది.బచ్చలి ఆహారంలో చేర్చుకోవటంవల్ల చర్మానికి కొత్త మెరుపును ఇస్తుంది.బరువు తగ్గాలనుకునేవారు బచ్చలి కూరను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.మూత్రవిసర్జనలో సమస్యలు ఉన్నవారు రోజూ బచ్చలికూర కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.బచ్చలి ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే పుండ్లు తగ్గుతాయి.మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది,పచ్చకామెర్లు వచ్చి తగ్గాక బచ్చలి కూర తింటే త్వరగా కోలుకుంటారు.కీళ్లనొప్పుల సమస్యలు, పైల్స్ సమస్యలు, శరీరంలో కొవ్వు తగ్గడానికి బచ్చలికూర మంచి ఆహారం.బచ్చలికూర శరీరంలోని వేడిని తగ్గిస్తోంది. కొన్ని ఆకులు నూరి కణతకు పెడితే.. తలలోని వేడి కూడా తగ్గుతుంది.దీంతో తరచుగా వచ్చే దగ్గు, పైత్యం, అతిదాహం సమస్యలు తీరతాయి.

2. మెంతి ఆకు

మెంతి ఆకులు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహయపడతాయి. ఇందులో ఐరన్, సెలీనియం, కాల్షియం, మాంగనీస్, మినరల్స్, జింక్ వంటి పోషకాలున్నాయి. ఇవి అనారోగ్య సమస్యలను తగ్గించడంలోఎక్కువగా సహాయపడతాయి.పచ్చి మెంతి ఆకులు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ సమస్యలో చక్కర స్తాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా.. ఇవి మంచి కొలెస్ట్రాల్‏ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. మెంతి ఆకులలో పీచు జీర్ణక్రియ ప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.అధిక రక్తపోటులో మెంతి ఆకులు కూడా మేలు చేస్తాయి. గెలాక్టోమన్నన్, పొటాషియం ఉండడం వలన రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. మెంతి ఆకులు బరువు తగ్గిస్తాయి. అలాగే అజీర్ణం, మలబద్దకం, కడుపులో అల్సర్, పేగు మంట సమస్యను తగ్గిస్తుంది.

3. పాలకూర

పాలకూరను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కేలరీలు అందుతాయి. త్వరగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి పాలకూర ఎంత గానో ఉపయోగ పడుతుంది. పాలకూరలో ఒక గ్రాము ప్రోటీన్స్, ఒక గ్రాము పిండి పదార్థాలు, 0 .7 గ్రామ్స్ ఫైబర్ కలిగి ఉంటుంది. పాలకూరలో ఆమ్లం, విటమిన్ ఏ, విటమిన్ బి6 వంటివి కూడా ఉంటాయి. అలానే ఇతర పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. పాలకూరను తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు పని తీరులో కూడా వేగం పెరుగుతుంది.పాలకూర తీసుకుంటే ఐరన్ అందిస్తుంది అలాగే ప్రోటీన్ కూడా మనకి వస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది.షుగర్ సమస్యతో బాధపడే వారు పాలకూర తీసుకుంటే చాలా మేలు కలుగుతుంది. అలాగే కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్ళు, కాన్సర్, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా పాలకూరను తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడుతుంది. కంటి చూపుని మెరుగు పరచడానికి కూడా పాలకూర బాగా ఉపయోగ పడుతుంది ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

4. తోటకూర

తోటకూరలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి.తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం ఉంటాయి.విటమిన్‌ A, C, D, E, K, విటమిన్‌ B12, B6 వంటివన్నీ తోటకూరలో ఉంటాయి.తోటకూర కొవ్వును తగ్గిస్తుంది,రోజూ తోట కూర తింటే బరువు తగ్గుతారు.తోటకూరలోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది, రక్తనాళాల్ని చురుగ్గా ఉంచుతుంది.వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది.కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు ఒక్కతోట కూరలోనే లభిస్తాయి.

5. బ్రోకలీ

బ్రోకలీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలో విటమిన్లు సి, కె, ఎ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్​కు మంచి మూలం. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు, ఆరోగ్యకరమైన ఎముకలు, చర్మానికై.. జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి.లో ఐరన్‌ పెద్ద మొత్తంలోనే ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది.బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలలో ఫ్లేవనాయిడ్స్, సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో ఈ సమ్మేళనాలు సహాయపడతాయి.బ్రోకలీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

6. చుక్కకూర

రుచి ప‌రంగానే కాదు చుక్క‌కూర‌లో పోష‌కాలూ మెండుగా ఉంటాయి.ముఖ్యంగా చుక్క‌ కూర‌లో ఉండే ఐర‌న్ కంటెంట్ ర‌క్త‌హీన‌త‌ను నివారించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ ప‌డుతుంది.త‌ర‌చూ చుక్క‌ కూరను తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.ఫ‌లితంగా గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌తో బాధ ప‌డే వారు ఖ‌చ్చితంగా చుక్క‌ కూరను తీసుకోవాలి.చుక్క‌కూర‌లో విట‌మిస్ సి తో పాటు శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి.అందు వ‌ల్ల‌, ఈ ఆకుకూర‌ను డైట్‌లో చేర్చుకుంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారుతుంది.

7. పుదీనా

పుదీనాలో విటమిన్ A, Cతో పాటు బి-కాంప్లెక్స్ అధికంగా ఉంటాయన్నారు. పుదీనా ఆకులు చర్మాన్ని మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నారు. పుదీనాలో ఉండే మరో ప్రయోజనం ఏంటంటే.. ఐరన్, పొటాషియం, మాంగనీస్ అధికంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్‌ పెరుగుతుందన్నారు. అంతేకాకుండా పుదీనా తరచూ తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుందన్నారు.

8. కరివేపాకు

కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాల ఉన్నాయి. అందువల్ల కరివేపాకును కేవలం వంటల్లోనే కాకుండా.. వివిధ ఔషదాల్లోని ఉపయోగిస్తారు. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి.జుట్టు సమస్యలను నివారించేందకు కరివేపాకు ఉపయోగపడుతుంది.రీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది.కరివేపాకులో ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరుస్తుంది.పాము కాటు ఉపశమనం కోసం కరివేపాకు బెరడును వాడతారు.కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి ఉంటాయి.లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు కరివేపాకు మంచి ఔషదం అని తేలింది. కరివేపాకు వేర్లను శరీర నొప్పులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.

9. కొత్తిమీర

హైబీపీ తో బాధ పడుతున్న వారికి కొత్తిమీర సలాడ్ తీసుకోమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటివి వచ్చే రిస్క్ ని బాగా రెడ్యూస్ చేస్తుంది. కొత్తిమీర ఆకులు వికారానికీ, అజీర్ణ సమస్యలకీ మంచి విరుగుడు. ఇది తీసుకోవడం వల్ల పొట్టలో అరగడానికి హెల్ప్ చేసే డైజెస్టివ్ జ్యూసులు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది.కొత్తిమీర కి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ లో ఒకటి షార్ప్ ఐ సైట్. కొత్తిమీర లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్ఫరస్ విజన్ డిసార్డర్స్ ని ప్రివెంట్ చేస్తాయి. కంటి మీద ఒత్తిడిని తగ్గిస్తాయి.ఆస్తియోపొరాసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని కొత్తిమీర తీసుకోమని చెబుతారు. ఎముకలు బలంగా, ఆరోగ్యం గా ఉండాలని కోరుకునే వారందరూ కొత్తిమీరని వారి రోజువారీ ఆహారంలో తప్పని సరిగా భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే కాల్షియం, ఇంకా ఇతర మినరల్స్, బోన్ డిగ్రడేషన్ ని ప్రివెంట్ చేస్తాయి, బోన్ రీగ్రోత్ కి హెల్ప్ చేస్తాయి.కొత్తిమీర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి.

10. గోంగూర

గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి2 , విటమిన్ బి 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.ఇందులోని క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా కంట్రోల్ చేస్తాయి.

11. పొన్నగంటి కూర

పొన్న‌గంటి కూర‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, రైబో ఫ్లేవిన్, పొటాషియం, మెగ్నిషియం, ఐర‌న్, జింక్ ల‌తోపాటు ప్రోటీన్స్ కూడా పుష్క‌లంగా ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ ఆకు కూర‌ను త‌ర‌చూ తింటే చాలా మంచిది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది.పొన్నగంటి కూర జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ చికిత్సగా ఉపయోగిస్తారు.న్నగంటి కూర ఆకులు నలభై ఎనిమిది రోజులు తింటే, కీలకమైన ఖనిజాలు, పోషకాల అధిక కంటెంట్‌ను అందిస్తుందని, ఇది కళ్ళను పోషించడంలో సహాయపడుతుందని, చర్మం సహజమైన సౌందర్యాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది. పొన్నగంటి కూరలో జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది.

12. చింత చిగురు

చింత చిగురు లో ఎక్కువగా వున్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట రాల్ ను తగ్గించి.. అదే సమయంలో మంచి కొలెస్ట రాల్‌ను పెంచుతుంది. చింత చిగురులో ఉన్న యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలున్నాయి. దీంతో చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. చింత చిగురు పైల్స్ ఉన్న వారికి నివారణగా ఉపయోగపడుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని చింత చిగురు తగ్గిస్తుంది. నోటి పూత కు చింత చిగురు నివారిణిగా పనిచేస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు మంచి ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు చింత చిగురు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. చింత చిగురును ముద్దగా దంచి కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి చింతచిగురు మేలు చేస్తుంది. కంటి సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

13. మునగాకు

మునగ ఆకుల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. మునగ ఆకుల్లో యాంటీట్యూమర్, యాంటిపైరేటిక్, యాంటీపైలెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అల్సర్, యాంటిస్పాస్మోడిక్, డైయూరిటిక్, యాంటీహైపెర్టెన్సివ్, యాంటీ డయాబెటిక్, హెపాటోప్రొటెక్టివ్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.

14.తమలపాకు

తమలపాకులో యాంటీ-టాక్సిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్‌, యాంటీ డయాబెటిక్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-క్యాన్సర్, యాంటీ-అల్సర్‌‌ లక్షణాలు ఉన్నాయి. తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద డాక్టర్‌ శరద్‌ కులకర్ణి అన్నారు. దీన్ని తిన్నా, తమలపాకు టీ తాగినా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. ప్రతి రోజూ ఉదయం.. ఖాళీ కడుపుతో తమలపాకు తింటే.. నోటి దుర్వాసన, క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. తమలపాకులలో యాంటీ-హైపర్‌గ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.తమలపాకు నోటి ఆరోగ్యానికి మంచిది. నోటిలోని బ్యాక్టీరియాతో.. తమలపాకు పోరాడుతుంది. ప్రతి రోజూ ఉదయం తమలపాకు తింటే.. నోటి దుర్వాసన సమస్య దూరమవుతుంది. తమలపాకు తింటే.. నోటి ఇన్ఫెక్షన్లు, అల్సర్లు కూడా తగ్గుతాయి. ప్రతి రోజూ తమలపాకు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. ముఖ్యమైన విటమిన్లు, పోషకాలను గ్రహించడానికి ప్రేగులను ప్రేరేపిస్తుంది. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి క్యాన్సర్‌ కణాలతో పోరాడతాయి, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నట్లయితే, తమలపాకులు గొప్ప ఔషదంలా పనిచేస్తాయి. తమలపాకులు తలనొప్పికి హోమ్‌ రెమిడీలా పనిచేస్తుంది. మైగ్రేన్‌ నుంచి ఉపశమనం పొందడానికి.. తమలపాకు ఉపయోగపడుతుంది.

15. చెంచలి కూర

ఈ మొక్కలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. అనేక రకాల రోగాలను నయం చేయడంలో చెంచలాకు బాగా ఉపకరిస్తుంది. చెంచలాకులో కాల్షియం అధికమోతాదులో ఉంటుంది. దీన్ని తినటం వల్ల ఎముకలు ధృఢంగా తయారవుతాయి. కంటి సమస్యలను దరి చేరకుండా ఉంచటంలో ఇందులో ఉండే విటమిన్ ఎ దోహదపడుతుంది. వాత, పిత్త, కఫ దోషాలను పొగొడుతుందని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా, తామర, ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, రుతుక్రమం ఆగిన లక్షణాలు వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేసేందుకు హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తారు.జీర్ణ వ్యవస్ధ పనితీరును మెరుగుపరచటంతోపాటు మలబద్ధకాన్ని పోగొడుతుంది. బాలింతలో పాలు బాగా రావాలంటే.. ఈ చెట్టు వేర్ల కషాయాన్ని కొద్ది మొత్తంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట.మొక్క ఆకుల కషాయాన్ని కొద్ది మోతాదులో తాగడం వల్ల మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోతాయట. ఆకులను పేస్ట్‌గా చేసి గాయాలపై, పుండ్లపై ఉంచడం వల్ల త్వరగా మానిపోతాయి. చిన్నపిల్లలకు ఈ ఆకు కూరను పప్పులో వేసి పెడితే ఎంతో మంచిది. ఎంతో ఇష్టంగా కూడా తింటారు. శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించటంలో ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా, తామర, ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, రుతుక్రమం ఆగిన లక్షణాలు వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేసేందుకు హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తారు.