నిత్య పూజా విధానం

Sample Image

విఘ్నేశ్వర ధ్యానం:

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.
***

గురుధ్యానము:

గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైః శ్రీ గురవేన్నమః

దీపారాధన శ్లోకం:

దీపజ్యోతి: పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన:
దీపో మే హరతు పాపం దీపజ్యోతిర్నమోఽస్తు తే

భోదీప దేవి రూపస్త్వం, కర్మ సాక్షిహ్య విఘ్నకృత్, యావత్ పూజాం కరిష్యామి, తావత్వం సుస్థిరో భవ.

ఘంటానాదం:

ఆగమార్థాంతు దేవానాం గమనార్థాంతు రక్షసాం
కుర్యాద్ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనం

ఆచమనం:

కుడి చేతి చూపుడు వ్రేలుకు,నడిమి వ్రేలుకు మద్యన బొటన వ్రేలుంచి,చూపుడువేలును బొటన
వ్రేలుపైకి మడిచి తక్కిన మూడు వ్రేళ్ళూ చాపి,అరచేతిని దోనెలా మలచి ఉద్దరిణెడు ఉదకాన్ని
యెడమచేతితో తీసుకుని కుడిచేతిలో పోసుకుని,ముందుగా

  1. "ఓం కేశవాయస్వాహ" అని చెప్పుకుని లోనికి తీసుకోవాలి,ఆనీరు కడుపులో బొడ్డువరకు దిగిన తరువాత

    మరల పైవిధంగానే

  2. "ఓం నారాయణాయ స్వాహ" అనుకుని ఒకసారీ,
  3. "ఒం మాధవాయస్వాహ" అనుకుని ఒకసారి జలం పుచ్చుకోవలెను.అట్లు చేసి
  4. "ఓం గోవిందాయనమః" అని చేతులు కడుగుకోవాలి.పిదప
  5. "విష్ణవేనమః" అనుకుంతూ నీళ్ళు తాకి,మధ్యవ్రేలు,బొటనవ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి.పిదప
  6. "ఓం మధుసూదనాయనమః",పై పెదవిని కుడినించి ఎడమకి నిమురుకోవాలి.
  7. ఓం త్రివిక్రమాయనమః క్రింద పెదవిని కుడినించి ఎడమకి నిమురుకోవాలి.
  8. .ఓం వామనాయనమః,ఓం శ్రీధరాయనమః , ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లుకోవాలి.
  9. ఓం హృషీకేశాయనమః ఎడమ చేతితో నీళ్ళు చల్లలి.
  10. ఓం పద్మనాభాయనమః పాదాలపై ఒక్కొక్క చుక్కనీరు చల్లుకోవాలి.
  11. ఓం దామోదరాయనమః శిరస్సుపై జలమును ప్రొక్షించుకోవలెను.
  12. ఓం సంకర్షణాయనమః చేతివ్రేళ్ళు గిన్నెలా వుంచి గెడ్డము తుడుచుకోవలెను.
  13. ఓం వాసుదేవాయనమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
  14. ఓం ప్రద్యుమ్నాయనమః, ఓం అనిరుద్దాయనమః నేత్రాలు తాకవలెను.
  15. ఓం పురుషొత్తమాయనమః , ఓం అధోక్షజాయనమః రెండు చెవులూ తాకవలెను.
  16. ఓం నారసిం హాయనమః,ఓం అచ్యుతాయనమః బొడ్డును స్పౄశించుకోవలెను.
  17. ఓం జనార్ధనాయనమః చేతివ్రేళ్ళతో వక్షస్థలం,హృదయం తాకవలెను
  18. ఓం ఉపేంద్రాయనమః-చేతికొనతో శిరస్సు తాకవలెను.
  19. ఓం హరయేనమః,
  20. ఓం శ్రీకృష్ణాయనమః-కుడి మూపురమును ఎడమ చేతితోను, ఎడమ మూపురమును కుడిచేతితోను తాకవలెను.

శివనామములు:

ఏ దేవతను పూజించేందుకైనా పై కేశవనామములతోనే ఆచమనం చేయాలి.కాని,ప్రత్యేకించి-శివపూజకు మాత్రం శివనామాలతోనే ఆచమనం చేయాలి.ఆ శివనామాలను ఈ దిగువ ఇస్తున్నం.శివపూజను ప్రత్యేకించి ఈ విధంగానే చేయాలి.

ఓం శమ్న్నోరభేష్టయ ఆపో భవంతు ప్రీతయే శంన్నో రభిస్రవంతు నః-(యజుర్వేదం) శంన్నో రభిస్రవంతు నః-(యజుర్వేదం) అర్ధం:ఎడతెగని దాహమైపొఇందీ బ్రతుకు ఎంత దాహామో దాహం.అతువంతి దాహం సమస్తం తీరేలాగున-దివ్యగుణ సమన్వితమైన బ్రహ్మానందరస స్రవంతి నిత్యమై వెల్లివిరిసి ప్రవహించును గాక. శివనామాలు

  1. ఓం మహేశ్వరాయ నమః
  2. ఓం మహాదేవాయనమః
  3. ఓం సర్వెశ్వరాయనమః
  4. ఓం శివాయనమః
  5. ఓం శంకరాయనమః
  6. ఓం శాశ్వతాయనమః
  7. ఓం పశుపతేనమః
  8. ఓం ఉమపతేనమః
  9. ఓం బ్రహ్మధిపతే నమః
  10. ఓం పరమేశ్వరాయనమః
  11. ఓం భస్మాంగరాగాయనమః
  12. ఓం మహేష్వాయనమః
  13. ఓం నిత్యాయనమః
  14. ఓం శుద్దయనమః
  15. ఓం మృత్యుంజయాయనమః
  16. ఓం భూతేశాయనమః
  17. ఓం మృదాయనమః
  18. ఓం శర్వాయనమః
  19. ఓం సదాశివాయనమః
  20. ఓం అభవాయనమః
  21. ఓం సర్వజ్ఞాయనమః
  22. ఓం భీమాయనమః
  23. ఓం వాసుదేవాయనమః
  24. ఓం త్రిపురాంతకాయనమః
  25. ఓం నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకరాయ నమః

ఆత్మశుద్ది:

ఆత్మశుద్దికై మార్జనం చేసుకోవాలి శ్లో:అపవిత్రః పవిత్రోవా-సర్వావస్థాంగతోపివా యః స్మరేత్పుండరీకాక్షం-సబాహ్యబ్యంతరశ్శుచిః అని అనుకుని-కాసిని నీళ్ళు తలపై స్నానార్ధమన్నట్టుగా ప్రోక్షించుకోవాలి.

భూశుద్ది:

అలాగే మరి కాసిని నీళ్ళు చేతిలో పోసుకుని దిగువ మంత్రం జపిస్తూ చుత్తూ చల్లుకోవాలి. "ఉత్తిష్టంతు భూతపిశాచాః యేతే భూమిభారకాః ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే"

రెండక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకోవాలి.

శ్లో:ఆపదా మపహర్తారాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీ రామంభూయోభూయోనమామ్యహం శ్లో:య శ్శివో నామరూపాభాయాం యా దేవీ సర్వమంగళా శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఓం శ్రీ ఉమామహేస్వరాభ్యామ్నమః
ఓం శ్రీవాణీహిరణ్యగర్భాభ్యాం నమః,
ఓం శ్రీ శచీపురందరాభ్యాం నమః
ఓం శ్రీ అరుంధతీవశిష్టాబ్యాం నమః,
ఓం శ్రీ సీతారామాబ్యాం నమః
ఓం శ్రీ సర్వభూదేవతాభ్యాం నమః,
ఓం శ్రీ గ్రామదేవతాబ్యాం నమః,
ఓం శ్రీ గృహదేవతాబ్యాం నమః,
ఆదిత్యాది నవగ్రహదేవతాబ్యాం నమః

శ్లో:ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఓం సర్వేభ్యొ మహాజనేభ్యొ నమః

అయం ముహుర్తస్సుముహూర్తొస్సు (అనుకుని ప్రణాయామమౌ చేయవలెను)

ప్రాణామాయ మంత్రము:

(ఎవరి కుడిచేతితో వారు తమ ముక్కును పట్టుకుని ఈ దిగువ మంత్రము చెప్పుకోవలెను)
ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||

||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః ||
(అని నాలుగు దిక్కులా ఉద్ధరని తో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా.)

సంకల్పం:

మమోపాత్తదురితక్షయద్వార, శ్రీ పరమేశ్వర(రీ) ప్రీత్యర్ధం, శుభే శొభన ముహుర్తే, శ్రీ మహావిష్ణురాజ్ఞాయ-అని చెప్పుకోవాలి.(శివపూజలో మాత్రం "శ్రీ శివ శివ శంభోరాజ్ఞాయా" అని చెప్పుకోవాలి) ప్రవర్తమానస్య, అద్యబ్రహ్మణ, ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే-వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రధమ పాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య వాయువ్యప్రదెశే- కృష్ణా గోదావరీ మధ్య ప్రదేశే, స్వగృహే/లక్ష్మీ గృహే (ఇక్కడ ఎక్కడ పూజచేస్తున్నామో ఆ ప్రదేశాన్ని పేర్కొనాలి) అస్మిన్-వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభ వాది షష్టి సంవవత్సరాణాం మద్యే(పూజా సమయము నాటికి నడుచుచున్న సంవత్సరము పేరుని చెప్పుకుని) సంవత్సరే-(జనవరి నెలలో వచ్చే సంక్రాంతి-పెద్దపండుగ మొదలుకొని,జూన్-జూలై నెలలలో వచ్చే కకాటక సంక్రమణం వరకూ అంతే జనవరి15 నుంచి జూలై 14 వరకూ గల ఆరు నెలలూ ఉత్తరాయణం,ఆ కర్కటక సంక్రాంతి మొదలు మళ్ళా పెద్దపండుగ దాకా జూలై15 నుండి జనవరి14 వరకు దక్షిణాయనం.పూజచేసే సమయాన్ని బట్టి,అది ఉత్తరాయణమో,దక్షిణ అయనమో తెసుకుని ఆ పేరు చెప్పుకోవాలి.) అయనే(ఋతువు పేరు అనుకోవాలి) ఋతౌ,(అది మన తెలుగు నెలల్లో ఏనెలయో తెలుసుకుని-ఆ నెల పేరు చెప్పవలేను), మాసే(అట్లే అమావాస్యకు ముందరిరోజులైనచో బహుళపక్షము,పున్నమికి ముందరి రోజులైతే శుక్లపక్ష్ము,ఇక్కడ అది ఏ పక్షమో అది చెప్పుకోవలెను.) పక్షే(ఆ రొజు యే తిధియో అది పంచమి అయినచో పంచమ్యాం తిధౌ అనుకోవాలి.) తిధౌ(అనునప్పుదు-ఆదివారాది వారములలో ఆరోజుయొక్క పేరు సోమారమ,గురువారమా అనునది యేదియినది చెప్పుకోవలెను.) వాసరేఅలా చెప్పిన పిదప -దిగువ విధముగా గొత్రనామాదులను చెప్పుకోవలెను .

పూజ చేయువారు పురుషులైనచో :శ్రీమాన్-గోత్రః-నామదేయః,శ్రీమతః-గోత్రస్య-నామదేయస్య(అనియు) స్త్రీలైనచో:శ్రీమతిః గొత్రవతిః -నామదేయవతిః,శ్రీమత్యాః-గొత్రవత్యాః-నామదేయవత్యాః-(అనియు)గొత్రనామములు చెప్పుకొనిన అనంతరం ఎవరిమటుకువారే ఈ క్రింది విధంగా అనుకోవాలి. అస్మాకం సహకుటుంభానాం-క్షేమ, స్థైర్య, దైర్య, వీర్య-విజయ, ఆయురారొగ్య-ఐశ్వర్యాభివృద్యర్ధం, సకలవిధమనోవాంచాఫలసిద్యర్ధం- ఇష్టకామ్యార్ధ సిద్యర్ధం శ్రీ లక్ష్మీ దేవి.... (ఏ దేవతను పూజించదలిచామో ఆదేవుని పేరు చెప్పాలి)ముద్దిశ్య- మహాగణపతి దేవతా ప్రీత్యర్ధం శ్రీ లక్ష్మీ దేవి దేవాతా పూజాంచ కరిష్యే-(అని చెప్పుకుని కుడిచేతి నడివ్రేలితో నీళ్ళను స్పృసించాలి)(కేవం వుదాహరణకోసం 'శ్రీ లక్ష్మీ దేవి' పూజ చేస్తున్నట్టుగా ఆ పేరు వ్రాయడం జరిగింది.పై చెప్పిన 'శ్రీ లక్ష్మీ దేవి' అని వున్న చోట మనం ఏ దేవతని పూజించబోతున్నమో ఆ దేవత పేరు చెప్పుకోవాలి) అదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్ధం శ్రీ మహాగణపతి పూజాంచ కరిష్యే-అని చెప్పుకుని మరలా ఉదకమును స్పృశించవలెను.

కలశపూజ:

అటు పిమ్మట ఒక పాత్రకు(చెంబువంటిదానికి-లేదా గ్లాసుకు) పసుపు పూసి,గంధం,కుంకుమబొట్టు పెట్టి ఆ జలపాత్రలో ఒక పువ్వును కాని,పత్రినికాని ఉంచి యజమానులు(ఒకరైతే ఒకరు ,దంపతులైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి- ఇలా అనుకోవాలి...

శ్లో: కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితాః మూలే తత్రస్థితో బ్రహ్మా-మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌతుసాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద స్సా మవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః అత్ర తిష్ఠంతు సావిత్రీ-గాయత్రీ చ సరస్వతీ స్కందోగణపతిశ్చైవ శాంతిః పుష్ఠ్కరీ తధా-శ్లో: గంగే చ యమునేచైవ గోదావరీ సరస్వతీ నర్మదా సింధూ కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు అయాంతుం దేవపూజార్ధం -మమ దురితక్షయ కారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మనాం చ సంప్రోక్ష్యహః

ఆ కలశమందలి నీరును పువ్వుతోగాని ఆకుతోగాని ఈదిగువ మంత్రం చదువుతూ- దేవతలపైనా,పూజాద్రవ్యాలపైనా,తమపైనా చిలకరించుకోవలెను.

మార్జనము:

ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపివా య స్మరేత్పుండరీకాక్షం స బాహ్యంభ్యంతరశ్శుచిః.

పిదప కాసిని అక్షతలు,పసుపు,గణపతిపై వేసి, ఆయనను తాకి నమస్కరించి ప్రాణప్రతిష్ఠ చేవలెను.

శ్రీ మహగణాధిపతయే నమః ప్రాణ ప్రతిస్ఠాపన ముహుర్తస్సు -తధాస్తు.

తరువాత దిగువ విధంగా చదువుతూ పసుపు వినాయకునకు నమస్కరించాలి.

సుముఖ శ్చై కదంతశ్చ కపిలో గజకర్ణః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతు ర్గణాద్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబో స్కందపూర్వజః షోడశైతాని నామాని యఃపఠేచ్చుఋణుయా దపి విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ఓం శ్రీ మహగణాధిపతియే నమః

ధ్యాయామి-(అని కాసిని అక్షతలు పసుపు గణపతిపై వేయవలెను.)

ధ్యానం:

శ్లో: భవసంచిత పాపఘ విద్వంసన విచక్షణం
విఘ్నాంధకార భాసత్వం విఘ్న రాజ మహం భజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పశాంకుశధరం దేవం ధ్యే త్సిద్దివినాయకం
శ్లో: ద్యాయే ద్గజాననం దేవం తప్త కాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం
ఓం శ్రీ మహగణాదిపతయే నమః ధ్యానం సమర్పయామి

ఆవాహనం:

అత్రాగచ్చ జగద్వంద్వ -సురరా జి ర్చితేశ్వర
అనాధనాధ సర్వజ్ఞ-గౌరీగర్భసముద్భవ
ఓం శ్రీ మహగణాధిపతయే నమః-ఆవాహయామి

ఆసనం:

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నై ర్విరాజితం
రత్నసిమ్హాసనం చారుప్రీత్యర్ధం ప్రతిగ్రుహ్యతాం
ఓం శ్రీ మహాగణపదిపతయేనమః - సిం హాసనార్ధం అక్షతాన్ సమర్పయామి-అని చెప్పుకుని అక్షతలు వేయవలెను.

అర్ఘ్యం:

గౌరిపుత్ర నమస్తేస్తు శంకర్స్య ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
ఓం శ్రీ మహగణాదిపతయేనమః అర్ఘ్యం సమర్పయామి-పువ్వుతో నీరు చల్లవలెను.

పాద్యం:

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
ఓం శ్రీ మహాగణాదిపతయే నమః-
పాద్యం సమర్పయామి అని పువ్వుతో నీరు చల్లవలెను.

ఆచమనీయం:

అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో
ఓం శ్రీ మహగణాధిపతయేనమః_ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం:

దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్వేన సమన్వితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః -మధుపర్కం సమర్పయామి

పంచామృతస్నానం:

స్నానం పంచామృతైర్ధేవ గృహాణ గణనాయక
అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-పంచామృతస్నానం సమర్పయామి.
(ఆవుపాలు,ఆవుపెరుగు,ఆవునెయ్యి,తేనె,పంచదార అనే ఆయిదింటినీ కలిపి పంచామృతములంటారు.)

శుద్దోదకస్నానం:

గంగాది సర్వతీర్ధ్యేభ్యై రాహ్రుతైరమలైర్జలైః
స్నానం కురుష్వ భగవన్నుమాపుత్రనమౌస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః-శుద్దోదకస్నానం సమర్పయామి.

వస్త్రయుగ్మం:

రక్తవస్త్రద్వయం చారుదేవయోగ్యంచ మంగళం
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజః
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః-వుపవీతం సమర్పయామి.

గంధం:

చందనాగరు కర్పూరం కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం
శ్రీ మహాగణాధిపతయేనమః గంధం సమర్పయామి.

అక్షతలు:

ఆక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలియాన్ స్తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే ఓం శ్రీమహాగణాధిపతయేనమః అక్షతాన్ సమర్పయామి.

పుష్పములు:

సుగంధాని సుపుష్పాణి,జాజికుంద ముఖానిచ
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-పుష్పం సమర్పయామి.

అధాంగ పూజా:

శ్రీమహాగణాధిపతయేనమః-పాదౌ పూజయామి
ఏకదంతాయనమః-గుల్భౌపూజయామి
శూర్పకర్ణాయనమః-జానునీ పూజయామి
విఘ్నరాజేనమః-జంఘే పూజయామి
అఖువాహనాయనమః-ఊరుం పూజయామి
హేరంభాయనమః-కటిం పూజయామి
లంబోదరాయనమః-ఉదరం పూజయామి
గణనాదాయనమః-నాభిం పూజయామి
గణేశాయనమః-హృదయం పూజయామి
స్థూలకంఠాయనమః-కంఠం పూజయామి
స్కంధాగ్రజాయనమః-స్కంధౌ పూజయామి
పాశహస్తాయనమః-హస్తౌ పూజయామి
గజవక్త్రాయనమఃవక్త్రం పూజయామి
విఘ్నహంత్రేనమః-నేత్రౌ పూజయామి
శూర్పకర్ణాయనమః-కర్ణౌపూజయామి
ఫాలచంద్రాయనమః-లలాటం పూజయామి
ఓం శ్రీమహాగణాధిపతయేనమః సర్వాణ్యంగాణి పూజయామి,

శ్రీ గణేశ్వురానుగ్రహసిద్ద్యర్ధం -పత్రం సమర్పయామి.అని చెప్పుకుని వినాయకునిపై పత్రియుంచవలెను.
(ముఖ్య గమనిక:వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడూనూ గణేశుని తెలసి దళములతో పూజించరాదని పెద్దల వాక్కు.)

అనంతరం ఓం గజననాయనమః,ఓం గజవక్త్రాయనమః మొదలగు 108 పేర్లతో వినాయకుని పూజించవలెను.అంత ఓపిక లేనివారు ఈ దిగువ 16 పేర్లూ జపిస్తూ పత్రితో,పుష్పములతో,అక్షతలు వగైరాలతో పూజించవలెను.

1. ఓం సుముఖాయనమః-పత్రం సమర్పయామి
2. ఓం ఏకదంతాయనమః-పుష్పం సమర్పయామి
3. ఓం కపిలాయనమః-అక్షతాన్ సమర్పయామి
4. ఓం గజకర్ణాయనమః-గంధం సమర్పయామి
5. ఓం వికటాయనమః-పత్రం సమర్పయామి
6. ఓం విఘ్నరాజాయనమః-పుష్పం సమర్పయామి
7. ఓం గణాదిపాయనమః-అక్షతాన్ సమర్పయామి
8. ఓం ధూమకేతవే నమః-గంధం సమర్పయామి
9. ఓం గణాద్యక్షాయనమః-పత్రం సమర్పయామి
10. ఓం ఫలచంద్రాయనమః-పుష్పం సమర్పయామి
11. ఓం గజాననాయనమః-అక్షతాన్ సమర్పయామి
12. ఓం వక్రతుండాయనమః-గంధం సమర్పయామి
13. ఓం శూర్పకర్ణాయనమః-పత్రం సమర్పయామి
14. ఓం హేరంభాయనమః-పుష్పం సమర్పయామి
15. ఓం స్కందపూర్వజాయనమః-అక్షతాన్ సమర్పయామి
16. ఓం సర్వసిద్ది ప్రదాయకాయనమః-గంధం సమర్పయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః-నానావిధ-పరిమళ పత్రపుష్ప శ్రీ గంధాక్షత పూజాం సమ్ర్పయామి.

పిదప అగరువత్తి వెలిగించి

శ్లో: దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ధూపం గృహాణ దేవెశ విఘ్నరాజ నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః
ధూపం సమర్పయామి-అనుకుంటూ గణపతికి చూపించవలెను.

పిమ్మట దీపం వెలిగించి-స్వామికి చూపించుతూ
శ్లో: భక్త్యా దీపం ప్రయచ్చామి-దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘొరాత్ దివ్యజ్యొతిర్నమోస్తుతే
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః సాక్షాత్ దీపం దర్శయామి.

అటు తరువాత ఒక బెల్లం ముక్కను పసుపు గణపతి వద్దనుంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ

"ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-గుడశకల నైవేద్యం సమర్పయామి.
ఓం పాణాయస్వాహ,
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః"
అంటూ ఆరుమార్లు చేతితో స్వామికి నివేదనం చూపించాలి.
పిదప
"ఓం శ్రీమహాగణాధిపతయేనమః" నైవేద్యనంతరం-"హస్తౌ ప్రక్ష్యాళయామి"అని పువ్వుతోఒకసారి నీరు చిలకాలి
"పాదౌ ప్రక్ష్యాళయామి" అని మరోసారి నీరు చిలకాలి."పునః శుద్దచమనీయం సమర్పయామి" అని ఇంకొక పర్యాయం నీరు చిలకాలి.

తదనంతరం

శ్లో: పూగీఫల సమాఉక్తం నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణసమాయుక్తం-తాంబూలంప్రతిగృహ్యతాం
అని చెబుతూ మూడు తమలపాకులు,ఒక పోక చెక్క స్వామి వద్ద ఉంచాలి.

శుద్దాచమనీయం సమర్పయామి అనుకోవాలి.

కర్పూరం వెలిగించి--ఓం శ్రీమహాగణాధిపతయేనమః-కర్పూర నీరాజనం సమర్పయామి.అని ప్రదక్షిణగా తిప్పుతూ చిన్నగా ఘంట వాయించవలెను.

అనంతరం మళ్ళా పువ్వుతో నీరు చిలుకుతూ "కర్పూర నీరాజానంతరం-శుద్దచమనీయం సమర్పయామి"అనుకోవాలి.

మంత్రపుష్పము:

అక్షతలు,పువ్వులు,చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని
మం: ఓం -హిరణ్య గర్భస్థం-హేమబీజం విభావసో
అనంతంపుణ్యఫలదం-అ(ం)త శ్శాంతింప్రయచ్చమే
"ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

పిమ్మట స్వామికి సాష్టాంగ దండప్రమాణాలాచరించి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ-
శ్లో: ఆయుర్దేహి యసోదేహి-శ్రియంసౌఖ్యంచ దేహిమే
పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహిమే గణనాయక
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-ప్రార్ధన నమస్కారాన్ సమర్పయామి అని ప్రార్ధించుకోవాలి.

అటుపైన పురుషుడు తన చేతితో అక్షతలు తీసుకుని,భార్యచేత అందులో ఉదకం పొయించుకొని--

"అవయా ధ్యానావాహనాది షొడశోపచార పూజయాచ-భగవాన్-సర్వాత్మకః-
"శ్రీ మహాగణాధిపతి స్సుప్రీతో సుప్రసన్నో వరదోభూత్వా-ఉత్తరేశుభకర్మణ్య విఘ్నమస్తితి భవంతో బ్రువంతు-ఉత్తరేశుభకర్మణ్యవిఘ్నమస్తు--తధాస్తు.
"శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి" అనుకొని స్వామి వద్ద అక్షతలు తీసుకొని తమ తలపై వెసుకోవలెను.

ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి యెత్తి- తిరిగి క్రింద ఉంచి,పళ్ళెరములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీఠముపై నుంచవలెను.

శ్లో: గచ్చ -గచ్చ-గణాధ్యక్ష్య స్వస్థానం పార్వతీసుత
యత్ర మహేస్వరోదేవ స్తత్రగచ్చ గణాధిప
ఓం శ్రీ మహాగణాధిపతయేనమః-యధాస్థానం ప్రవేసయామి.శోభనార్ధం పునరాగమనాయచ. ఇతి శ్రీ హరిద్రాగణపతీ(పసుపు గణపతి) పూజా సమాప్తః