సుబ్రమణ్య స్వామి నిత్య పూజా విధానం

మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి / స్కంద షష్టి / సుబ్బారాయుడి షష్టి.
షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం తప్పనిసరి. నాగ దోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయ. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కాంద పురాణం చెబుతున్నది.
పూజామందిరంలోని సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించుకుని సుబ్రహ్మణ్యాష్టకంతో స్వామిని ప్రార్థించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. సులభంగా ఇంటివద్ద సుబ్రహ్మణ్య పూజా చేసుకొనుట కొరకు పూర్తీ విధానం క్రింద ఇవ్వబడినది.
నమస్తే నమస్తే మహాశక్తి పాణే |
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ||
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే |
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ||
ఒకచేతిలో మహాశక్తి అయుదాన్ని, ఒకచేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొకచేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు అని శరణు వేడినవారికి శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు.
ఆవాహనం:
ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వ సేవిత |
తారకాసుర సంహారిన్ రక్షోబల విమర్ధన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆవాహయామి
రత్నసింహాసనం:
ఉమాసుతశ్శక్తిధరః కౌమార క్రౌంచదారణ |
ఇదం సింహాసనం దివ్యం గృహ్యతాం శంకరాత్మజ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(పుష్పము ఉంచవలయును)
పాద్యం:
గంగాజల సమాయుక్తం సుగంధం గంధసంయుతం |
పాద్యం చ ప్రతిగృహ్ణాతు పార్వతీ ప్రియనందన ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(కలశంలోని నీటిని అమ్మవారి పాదములు కడిగినట్టుగా భావించి చల్లవలయును)
అర్ఘ్యం:
స్కందో గుహష్షణ్ముఖశ్చ ఫాలనేత్ర సుతః ప్రభుః |
అర్ఘ్యం దాస్యామితే దేవ శిఖివాహో ద్విషద్భుజః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి
(మరల ఉదకము చల్లవలయును)
ఆచమనీయం:
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళుర్భక్త వత్సలః |
గంగాసుతశ్శరోద్భూతః ఆచమనం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి
(మరల నీళ్లు చల్లవలయును)
పంచామృత స్నానం:
పయోదధి సమాయుక్తం ఘృత శర్కరయా యుతం |
పంచామృత స్నానమిదం గృహణ సురపూజిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి
(పంచామృతములు పుష్పముతో చల్లవలెను)
శుద్ధోదకస్నానం:
నదీనాం దేవ సర్వాసాం అనీతం నిర్మలోదకం |
స్నాపయామి మహాసేన తథా శాంతిం కురుష్యమే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి
(మంచినీటిని పుష్పముతో చల్లవలయును)
వస్త్రం:
మహాసేనః కార్తికేయః మహాశక్తిధరో గుహః |
వస్త్రం సూక్ష్మం గృహాణత్వం సర్వదేవ నమస్కృతః ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(వస్త్రము లేదా అక్షతలు, పుష్పము ఉంచవలెను)
యజ్ఞోపవీతం:
నానారత్న స్వర్ణయుతం త్రివ్ర్తం బ్రహ్మసూత్రకం |
ఉపవీతం మయాదత్తం సంగృహాణ సురేశ్వర ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
గంధం:
శ్రీగంధాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః దివ్యశ్రీ గంధం సమర్పయామి
(గంధము పుష్పములో అద్ది సమర్పించవలెను)
అక్షతాన్:
శాలీయాంశ్చంద్రవర్ణాభాన్ హరిద్రా మిశ్రితాం స్తథా |
అక్షతాంస్తవ దాస్యేవాహం గృహాణ సురవందిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షంతలు చల్లాలి)
ఆభరణం:
భాషణాని విచిత్రాణి హేమరత్న మయానిచ |
గృహాణ భువనాధార భుక్తిముక్తి ఫలప్రద ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆభరణి సమర్పయామి
(పూలు, అక్షంతలు చల్లాలి)
పుష్పము:
సుగంధీని సుపుష్పాణి కేతకీ చంపకాని చ |
మయాహృతాని పూజార్థం కృపయా ప్రతిహృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః పుష్పాణి సమర్పయామి
(పూలు వేయాలి)
అథాంగ పూజ:
- ఓం జ్ఞానశక్త్యాత్మాకాయ నమః పాదౌ పూజయామి
- ఓం స్కందాయే నమః గుల్ఫౌ పూజయామి
- ఓం అగ్నిగర్భాయ నమః జానునీ పూజయామి
- ఓం బాహులేయాయ నమః జంఘే పూజయామి
- ఓం గాంగేయ నమః ఊరూ పూజయామి
- ఓం శరణోద్భవాయ నమః కటిం పూజయామి
- ఓం కార్తికేయాయ నమః ఉదరం పూజయామి
- ఓం కుమారాయ నమః నాభిం పూజయామి
- ఓం షణ్ముఖాయ నమః హృదయం పూజయామి
- ఓం తారకారి నమః కంఠం పూజయామి
- ఓం సేనానీ నమః వక్త్రం పూజయామి
- ఓం గుహాయా నమః నేత్రం పూజయామి
- ఓం బ్రహ్మచారిణే నమః కలౌ పూజయామి
- ఓం శివతేజాయ నమః లలాటం పూజయామి
- ఓం క్రౌంచాధారీ నమః శిరః పూజయామి
- ఓం శిఖివాహనాయ నమః సర్వాణ్యంగాని పూజయామి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ పూజ (ఒకొక్క నామానికి పసుపు/కుంకుమ/పూలు వేస్తూ చదవాలి)
- ఓం స్కందాయ నమః
- ఓం గుహాయ నమః
- ఓం షణ్ముఖాయ నమః
- ఓం ఫాలనేత్రాయ నమః
- ఓం ప్రభవే నమః
- ఓం పింగళాయ నమః
- ఓం కృత్తికాసూనవే నమః
- ఓం శిఖివాహాయ నమః
- ఓం ద్విషడ్భుజాయ నమః
- ఓం శక్తిధరాయ నమః
- ఓం పిశితాశప్రభంజనాయ నమః
- ఓంతారకాసురసంహర్త్రే నమః
- ఓం రక్షోబలవిమర్ధనాయ నమః
- ఓం మత్తాయ నమః
- ఓం ప్రమత్తాయ నమః
- ఓం ఉన్మాత్తాయ నమః
- ఓంసురసైన్యసురక్షకాయ నమః
- ఓం దేవసేనాపతయే నమః
- ఓంపాప్రాజ్ఞాయ నమః
- ఓం కృపాళవే నమః
- ఓంభక్తవత్సలాయ నమః
- ఓంఉమాసుతాయ నమః
- ఓం శక్తి ధరాయ నమః
- ఓం కుమారాయ నమః
- ఓం క్రౌంచదారణాయ నమః
- ఓం సేనానియే నమః
- ఓం అగ్నిజన్మనే నమః
- ఓం విశాఖాయ నమః
- ఓంశకరాత్మజాయనమః
- ఓంశివస్వామినే నమః
- ఓం గుణస్వామినే నమః
- ఓం సర్వ స్వామినే నమః
- ఓం సనాతనాయ నమః
- ఓం అనంతశక్తియే నమః
- ఓం అక్షోభ్యాయ నమః
- ఓం పార్వతీ ప్రియనందనాయ నమః
- ఓం గంగాసుతాయ నమః
- ఓం శరోద్భూతాయ నమః
- ఓం ఆహుతాయ నమః
- ఓం పావకాత్మజాయ నమః
- ఓం జృంభాయ నమః
- ఓంప్రజృంభాయ నమః
- ఓం ఉజృంభాయ నమః
- ఓం కమలాసనసంస్తుతాయ నమః
- ఓంఏకవర్ణాయ నమః
- ఓం ద్వివర్ణాయ నమః
- ఓం త్రివర్ణాయ నమః
- ఓం సుమనోహరాయ నమః
- ఓం చతుర్వర్ణాయ నమః
- ఓం పంచవర్ణాయ నమః
- ఓం సుమనోహరాయ నమః
- ఓం ప్రజాపతయే నమః
- ఓం అహర్పతయే నమః
- ఓం అగ్నిగర్భాయ నమః
- ఓం శమీగర్భాయ నమః
- ఓం విశ్వరేతసే నమః
- ఓం సురారిఘ్నే నమః
- ఓం హరిద్వర్ణాయ నమః
- ఓం శుభకరాయ నమః
- ఓం వటవే నమః
- ఓం వటువేషభృతే నమః
- ఓం పూషాయ నమః
- ఓంగభస్తియే మః
- ఓంగహనాయ నమః
- ఓం చంద్రవర్ణాయ నమః
- ఓం కళాధరాయ నమః
- ఓం మాయాధరాయ నమః
- ఓం మహామాయినే నమః
- ఓం కైవల్యాయ నమః
- శంకరాత్మజాయ నమః
- ఓం విశ్వయోనియే నమః
- ఓం అమేయాత్మాయ నమః
- ఓం తేజోనుథయే నమః
- ఓం అనామయాయ నమః
- vఓం పరమేష్ఠినే నమః
- ఓం పరబ్రహాయ నమః
- ఓంవేదగర్భాయ నమః
- ఓం విరాట్పతయే నమః
- ఓంపుళిందకన్యాభర్తాయ నమః
- ఓం మహాసారస్వతావృతాయ నమః
- ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
- ఓం చోరఘ్నాయనమః
- ఓం రోగనాశనాయ నమః
- ఓం అనంతమూర్తయే నమః
- ఓం ఆనందాయ నమః
- ఓంశిఖండీకృతకేతనాయ నమః
- ఓం డంభాయ నమః
- ఓం పరమఢంభాయ నమః
- ఓం మహాడంభాయ నమః
- ఓం వృషాకపయే నమః
- ఓం కారణోపాత్తదేహాయ నమః
- ఓం కారనాతీత విగ్రహాయ నమః
- ఓం అనీశ్వరాయ నమః
- ఓంఅమృతాయ నమః
- ఓం ప్రాణాయ నమః
- ఓం ప్రాణాయామపరాయణాయ నమః
- ఓం విరుద్ధహంత్రే నమః
- ఓం వీరఘ్నాయ నమః
- ఓం రకావతస్యాయ నమః
- ఓం శామకందరాయ నమః
- ఓం సుబ్రహ్మణ్యాయ నమః
- ఓం గుహాయ నమః
- ఓం ప్రీతాయ నమః
- ఓం బ్రహ్మణ్యాయ నమః
- ఓం బ్రాహ్మణప్రియాయ నమః
- ఓం వేదవేద్యాయ నమః
- ఓం అక్షయఫలదాయ నమః
- ఓంవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామనే నమః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్ఠోత్తర శతనామావళిః
దీపం:
అజ్ఞాన నాశనం దేవ జ్ఞాసిద్ధిప్రభో భవ |
సకర్పూరాజ్య దీపం చ గృహాణ సురసేవిత ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సాక్షాత్ దీపం దర్శయామి
(దీపం చూపించాలి)
నైవేద్యం:
భక్త్యైర్భోజ్యై స్సచోష్యైశ్చ పరమాన్నం స శర్క్రరం |
నైవేద్యం గృహ్యతాం దేవీ శంభుపుత్ర నమోస్తుతే ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి
(పిండి వంటలపై నీళ్ళు చల్లాలి)
తాంబూలం:
తాంబూలంచస కర్పూరం నాగవల్లీ దళైర్యుతం |
ఊగీఫల సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి
(తాంబూలం చూపాలి)
నీరాజనం:
కర్పూర వర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం |
ఇదం గృహాణ దేవేశ మంగళం కురు సర్వదా ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంగళ నీరాజనం దర్శయామి
(కర్పూరం వెలిగించాలి)
మంత్రపుష్పం:
మంత్రపుష్పం ప్రదాస్యామి గృహాణ వరదో భవ |
పరమేశ్వర పుత్రస్త్వం సుప్రీతోభవ సర్వదా ||
భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్ ||
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేవాయ ధీమహీ తన్నో షణ్ముఖి ప్రచోదయాత్ ||
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారం:
(చేతిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి)
యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్థన
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ప్రదక్షిణం సమర్పయామి
పునః పూజ:
- ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఛత్రం అచ్చాదయామి
- ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః చామరం వీజయామి
- ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఛత్రం అచ్చాదయామి
- ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః నృత్యం దర్శయామి
- ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః గీతం శ్రావయామి
- ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అశ్వాన్ ఆరోహయామి
- ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః గజాన్ ఆరోహయామి
- ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఆందోళికాం ఆరోహయామి
- ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి
క్షమా ప్రార్థన:
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అర్పణ:
అనయ ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక |
ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ సుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యా స్వామి షోడశోపచార పూజాం సంపూర్ణం.