పుట్టుమచ్చలు

పుట్టుమచ్చలు అనేవి మన చర్మంపై సహజంగా పెరుగుతాయి. ఇవి శరీరంలో ముఖ్యమైనవి కాదు. అందువల్ల కొన్నిసార్లు వీటిని తొలగిస్తూ ఉంటాము. కానీ కొన్ని పుట్టుమచ్చలు మంచి జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరియు సాంఘిక కార్యకలాపాలను అంచనా వేయటానికి జ్యోతిషశాస్త్రంలో మోలోసోఫి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మోలోసోఫి అనేది మీ జీవితం యొక్క ప్రాముఖ్యత మరియు మీ శరీరం యొక్క పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా చూపుతుందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
ఎక్కడ ఫలితం
నుదురు యొక్క కుడి భాగం నుదురు కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే,మీరు ఎల్లప్పుడూ సంపదతో ఆనందంగా ఉంటారని అర్ధం.
నుదురు యొక్క ఎడమ భాగం నుదురు యొక్క ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే,మీరు దుఃఖాన్ని పొందటం మరియు జీవితంలో అన్నింటిని నష్టపోతారని అర్థం.
నుదురు మధ్యలో మీరు సంపద మరియు కీర్తిని కలిగి ఉంటారని అర్థం.
గడ్డం మీద పుట్టుమచ్చ మీ గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే,అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.దీని వలన మీరు ఎల్లప్పుడూ మీ జీవిత భాగస్వామితో ఘర్షణలు ఉంటాయని సూచిస్తుంది.
కుడి కన్ను పైన కుడి కంటికి పైన పుట్టుమచ్చ ఉంటే,శుభవార్తలు వింటారు. ఇది ఎల్లప్పుడూ మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ చాలా అందుకోవటాన్ని సూచిస్తుంది.
ఎడమ కన్ను పైన మీ ఎడమ కంటి పైన పుట్టుమచ్చ ఉంటే, మీకు ఎల్లప్పుడూ బయట విషయాల మీద పోరాటం ఉంటుంది.
చెంపల మీద కుడి చెంప మీద పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ సంపద కలిగి ఉంటారని అర్ధం. అదే ఎడమ చెంప మీద ఉంటే సంపద కోల్పోయి బాధ పడతారని అర్ధం.
పెదవులపై ఇది ఆసక్తికరంగా ఉంటుంది! మీ పెదవిపై పుట్టుమచ్చ ఉంటే మీరు ఒక భారీ సెక్స్ డ్రైవ్ కలిగి ఉన్నారని సూచిస్తుంది.
మెడ మీద మెడ మీద పుట్టుమచ్చ ఉంటే,మీరు ఎక్కువకాలం లగ్జరీ జీవితాన్ని గడుపుతారని అర్ధం.
కుడిచెవి మీద కుడిచెవి మీద పుట్టుమచ్చ ఉంటే, తక్కువ జీవిత కాలాన్ని సూచిస్తుంది. అదే ఎడమ చెవిమీద ఉంటే ప్రమాదాలను నివారించగలుగుతారు.
ముక్కు మీద ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే,మీరు జీవితాంతం చాలా ప్రయాణాలు చేస్తారని అర్ధం.
అరచేతిలో కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది. అలాగే ఎడమ అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద కోల్పోతారని సూచిస్తుంది.
చేతుల మీద కుడి చేతిమీద పుట్టమచ్చలుంటే మీరు ధైర్యవంతులుగా ఉంటారు మరియు ఇతరులచేత గౌరవింపబడుతారు. ఎడమచేతి మీద పుట్టుమచ్చ ఉంటే బాయ్ బేబీని కలిగి ఉంటారు
కాళ్ళ మీద అతడు/ఆమె కాళ్ల మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా ప్రయాణం చేస్తారని చెప్పబడింది.
కనుబొమ్మ మధ్య మీ కనుబొమ్మ మధ్య పుట్టుమచ్చ ఉంటే ,మీరు విదేశాలలో ప్రయాణం చేస్తారని సూచిస్తుంది.
నడుము మీద మోలోసోఫి ప్రకారం,మీ నడుము మీద పుట్టుమచ్చ ఉంటే,మీరు భౌతిక ఆనందం మరియు అన్ని రకాల ఆనందాలు పొందే అవకాశం ఉంది.
వీపు మీద వీపు మీద పుట్టుమచ్చ ఉంటే,మీరు ఇతరుల మీద ఆధారపడటం మరియు చెడు నోరు కలిగి ఉంటారని సూచిస్తుంది.
నాభి మీద నాభి మీద పుట్టుమచ్చ ఉంటే,ఆ వ్యక్తి ఒక గొప్ప సెక్స్ డ్రైవ్ కలిగి ఉండటం మరియు పిల్లలు కలిగి ఉంటారు.
ఎడమ భుజం ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉంటే,ఆ వ్యక్తి పిరికివాడు మరియు అసంతృప్తి కలిగి ఉంటారని అర్ధం.
కుడి భుజం కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే,చాలా ధైర్యం మరియు సామర్థ్యం కలిగి ఉంటారని సూచిస్తుంది.
>