సాయిబాబా దేవాలయం, దిల్‍సుఖ్‍నగర్

Sample Image

హైదరాబాద్‌లో ఎన్ని సాయిబాబా దేవాలయాలు ఉన్నా.. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి ఉన్న ప్రత్యేకతే వేరు. నిర్మాణంలో ఈ గుడి షిరిడీలోని సాయిబాబా దేవాలయాన్ని తలపిస్తుంది. అందుకే ఈ మందిరాన్ని దక్షిణ షిరిడీగా పిలుస్తుంటారు. ఆలయం లోపల ప్రశాంత వదనంతో కనిపించే సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని పాలకమండలి ఆధ్వర్యంలో 1989లో ప్రతిష్ఠించారు. అంతకు ముందున్న పాత విగ్రహాన్ని ఆలయ ఎడమవైపు దర్శనార్థం ఉంచారు. ఇక 1991లో మొదటి అంతస్తు నిర్మించి ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. 1993లో దేవాలయ మెయిన్ ఆర్చ్‌ని నిర్మించగా.. 1994లో సాయినాథునికి స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు. 1996లో ఆలయం రెండో అంతస్తు నిర్మించారు. మొదట్లో చాలా చిన్నగా ఉన్న దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం.. తరువాత తరువాత అనేక ఆలయాల సముదాయంగా వెలసింది.

భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తూ అందరి మన్ననలు పొందిన దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయం తన సేవలకు గానూ తాజాగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ ఆలయంపై భక్తుల నమ్మకానికి, సేవల్లో పాలకవర్గం ఓర్పు, నేర్పునకు ఈ సర్టిఫికెట్ నిదర్శనంగా నిలుస్తుంది.

సాయిబాబా దేవాలయం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‍సుఖ్‍నగర్ లో ఉన్న దేవాలయం.నిర్మాణంలో షిర్డీలోని సాయిబాబా దేవాలయంలా ఉన్న ఈ దేవాలయం, హైదరాబాదులోని అత్యంత పేరొందిన దేవాలయాలలో ఒకటి. హైదరాబాదులో ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన మొదటి దేవాలయంగా రికార్డు కూడా సృష్టించింది.

చరిత్ర:

ఈ దేవాలయంలో 1980లో నిర్మించబడింది. భక్తులు ఈ దేవాలయాన్ని దక్షిణ షిరిడీగా పిలుస్తుంటారు. పాలకమండలి ఆధ్వర్యంలో 1989లో దేవాలయంలోని సాయిబాబా పాలరాతి విగ్రహాం ప్రతిష్ఠించబడింది. అంతకు ముందున్న పాత విగ్రహాన్ని ఆలయం ఎడమవైపు దర్శనార్థం ఉంచారు. 1990ల నుండి బాగా ప్రాచూర్యం పొందింది. ముఖ్యంగా గురువారం నాడు అనేకమంది భక్తులు వస్తారు. 1991లో మొదటి అంతస్తు నిర్మించి ధ్యాన మందిరం, 1993లో దేవాలయ ప్రధాన మందిరం నిర్మించగా, 1994లో సాయిబాబాకి స్వర్ణ కిరీటం అలంకరించారు. 1996లో దేవాలయం రెండో అంతస్తు నిర్మించబడింది.

పూజలు - ఉత్సవాలు

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో మరాఠీ పూజ, హారతి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిఏటా గురుపౌర్ణమి, శ్రీరామనవమి పండుగల సందర్భంగా ఈ దేవాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.