శ్రీ షిరిడి సాయి దేవాలయం - ఫిల్మ్ నగర్

Sample Image

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని రోడ్ నెం. 10లో శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం ఉన్నది. ఈ ఆలయంలో ప్రవేశించి సాయిని కొలిస్తే వారి వారి కోరికలు తీరుతాయని, భక్తులు విశేషంగా నమ్ముతారు.

ఈ ఆలయంలో ప్రధానదైవమైన శ్రీసాయిబాబాతో పాటు సాయిబాబాకి కుడివైపున వైకుంఠ సీతారాముల ఆలయం, ఎడమవైపున జ్ఞానసరస్వతి ఆలయం, శనేశ్వరస్వామి, గణపతి, దత్తాత్రేయుడు మొదలగు దేవతా మూర్తుల ఆలయాలు కూడా కలవు. ప్రతిరోజూ సాయి బాబాకి కాగడహారతి, అభిషేకాలు, అష్టోత్తరములు, జరుగుతాయి.

ప్రతి గురువారం ఆలయానికి అనేకమంది భక్తులు ఇక్కడకు వస్తారు. సరస్వతీ అమ్మవారికి మాఘశుద్ధ పంచమి, ఆశ్వయుజ శారదా నవరాత్రులు, మహా శివరాత్రులలో అత్యంత వైభవంగా పూజాకార్యక్రమములు జరుపుతారు. శనీశ్వర ఆలయంలో శనీశ్వరుడు శనిసింగనాపురంలో శనీశ్వరుడు ఉన్నట్లుగా ఉండటం ఈ ఆలయ విశేషం. ఈ ఆలయంలో ఉన్న సీతారాములవారికి, దత్తాత్రేయుల వారికి నిత్యం పూజలు జరుగుతాయి. ఇచ్చట పండుగ పర్వదినాలలో ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.