30 రకల శివాలంగాలు
సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం. రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయి.
01. గంధలింగం రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.
ఈ ఆలయాన్ని ప్రముఖ యాత్రికుడు 'మార్కో-పోలి' కూడా వేంగి చాళుక్య రాజవంశం యొక్క రాజధానిగా పేర్కొన్నాడు.
02. పుష్పలింగం నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.
03. నవనీతలింగం వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.
04. రజోమయలింగం పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.
05. ధాన్యలింగం యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.
06. తిలిపిస్టోత్థలింగం నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.
07. లవణలింగం హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.
08. కర్పూరాజ లింగం ముక్తిప్రదమైనది.
09. భస్మమయలింగం భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.
10. శర్కరామయలింగం సుఖప్రదం.
11. సద్భోత్థలింగం ప్రీతిని కలిగిస్తుంది.
12. పాలరాతిలింగం ఆరోగ్యదాయకం.
13. వంశాకురమయ లింగం వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.
14. కేశాస్థిలింగం వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.
15. పిష్టమయలింగం ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.
16. దధిదుగ్ధలింగం కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.
17. ఫలోత్థలింగం ఫలప్రదమైనది.
18. రాత్రిఫలజాతలింగం ముక్తిప్రదం.
19. గోమయలింగం కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.
20. దూర్వాకాండజలింగం గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.
21. వైడూర్యలింగం శత్రునాశనం, దృష్టిదోషహరం.
22. ముక్తాలింగం ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.
23. సువర్ణనిర్మితలింగం బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.
24. రజతలింగం సంపదలను కలిగిస్తుంది.
25. ఇత్తడి - కంచులింగం ముక్తిని ప్రసాదిస్తుంది.
26. ఇనుము - సీసపులింగం శత్రునాశనం చేస్తుంది.
27. అష్టథాతులింగం చర్మరోగాలను నివారిస్తుంది, సర్వసిద్ధిప్రదం.
28. తుష్టోతలింగం మారణక్రియకు పూజిస్తారు.
29. స్పటిక లింగం సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.
30. సీతాఖండలింగం పటికబెల్లంతో తయారు చేసింది, ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.