ఆనందూర్ పరమశివుడు
సుఖ జీవితానికి కావలసిన సిరిసంపదలు, సకల సదుపయాలు ఎన్ని వున్నా మంచి దేహారోగ్యం లేకపోతే ఆ జీవితం సంతోషాన్ని యివ్వదు. ఆరోగ్యంగా జీవిస్తూ ఏ సమస్యలు లేనప్పుడే కలిగిస్తుంది.
జీవితం సంతోషాన్ని ఆవిధమైన వరాలను ప్రసాదించే ఈశ్వరుడు తిరుమేనినాదన్ అనే పేరుతో ఆనందూర్ లో కొలువై వున్నాడు. 53 ఈశ్వరుని పూజించిన వారికి సంతోషకరమైన జీవితం లభించడం వలననే ఈ ఊరికి ఆనందూర్ అనే పేరు వచ్చిందట.
ఆనందూరీ.శ .8వ శతాబ్దంనాటికే ఈ ప్రాంతం మంచి నాగరికత సాధించింది. 550-950 సంవత్సరాలలో రాజ్యమేలిన కాలంలో శివకామవల్లి సమేతంగా తిరుమేని నాదర్ ఆలయం నిర్మించబడినది. సమయంలోనే ఈ ఊరిలో 24 వ తీర్ధంకరుడైన మహావీరుని విగ్రహం ప్రతిష్టించబడి చమణుల ఆధిక్యత ఎక్కువగా వున్నట్లు తెలుస్తున్నది.
తర్వాతి శతాబ్దంలో ఈ ఆలయనిర్వహణ కోసం వెళ్ళాన్ తెగవారి ఊళ్ళు అనేకం దానంగా యివ్వబడ్డాయి. ఆ విధంగా దానధర్మం గా యివ్వబడిన ఆ చుట్టుపక్కల ఊళ్ళలోని భూమి అంతా నల్లూరు అని పిలువబడినది. ఆ విధంగా ఆనందూర్ ఆలయం అవికర సుందరనల్లూరు అని ఆ కాలంలో పిలువబడినదని అక్కడ వున్న శిలా శాసనాలు తెలుపుతున్నవి.
కోజడయన్ రణధీరన్ (690...730) దాక్షిణాత్య శిల్పకళా చాతుర్యం ఉట్టిపడేలా గర్భగుడి, అర్ధమండపం కట్టడాలను నిర్మింపజేశాడు. పూర్వ పాండ్యులు నిర్మించిన యీ ఆలయాన్ని తరువాత వచ్చిన పాండ్యులు, సేతుపతి రాజులు మరింత అభివృద్ధిచేసినట్లు శిలాశాసనాలు వివరిస్తున్నాయి.
మహామండపాన్ని 24 శిలాస్థంభాల మీద నిర్మించారు. గర్భగుడిలో శివుడు లింగమూర్తిగా తిరుమేని నాదర్ అనే పేరుతో దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఈ శివునికి మణికంఠేశ్వరుడనే మరియొక పేరు వున్నది.
ఈ ఊరి వారు తమ ఇంటిలో ఏ శుభకార్యాలు జరిగినా యీ ఆలయంలో స్వామి సమక్షంలోనే జరుపుకుంటారు. అందువలన తమకు సుఖ సంతోషాలు లభిస్తాయని ధృఢంగా నమ్ముతారు.
శివగంగై జిల్లా దేవకోట - పరమకుడిమార్గంలో 32 కి.మీ. దూరంలో ఆనందూర్ వున్నది.