అరుణాచలం

Sample Image

అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, అచలం - కొండఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది.

ఈ కొండ శివుడని పురాణాలు తెల్పుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రమంటారు.

ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం.

గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది

పురాణం:

హిందూ పురాణాలలో, శివుని భార్య పార్వతి ఒకసారి కైలాస పర్వతం మీద ఉన్న పూల తోటలో తన భర్త కళ్ళు మూసుకుంది . దేవతలకు ఒక్క క్షణం మాత్రమే ఉన్నప్పటికీ, విశ్వం నుండి కాంతి అంతా తీసుకోబడింది మరియు భూమి, సంవత్సరాలుగా చీకటిలో మునిగిపోయింది. పార్వతి ఇతర శివ భక్తులతో కలిసి తపస్సు చేసింది. అప్పుడు ఆమె భర్త అన్నామలై కొండల పైభాగంలో భారీ అగ్ని స్తంభంలా కనిపించి , ప్రపంచానికి వెలుగునిచ్చాడు. అప్పుడు అతను పార్వతితో కలిసి అర్ధనారీశ్వరుడు , సగం స్త్రీ, సగం పురుషుడు శివుడు. అరుణాచల, లేదా ఎర్రని పర్వతం, అరుణాచలేశ్వర దేవాలయం వెనుక ఉన్న మరియు దాని పేరుగల ఆలయంతో సంబంధం కలిగి ఉంటుంది.కొండ కూడా పవిత్రమైనది మరియు లింగంగా పరిగణించబడుతుంది లేదా శివుని ప్రతిరూపంగా పరిగణించబడుతుంది.

మరొక పురాణం ప్రతిపాదించబడింది, ఒకసారి, విష్ణువు మరియు బ్రహ్మ ఆధిపత్యం కోసం పోటీ పడుతుండగా, శివుడు జ్వాలగా కనిపించాడు మరియు తన మూలాన్ని కనుగొనమని వారిని సవాలు చేశాడు. బ్రహ్మ హంస రూపాన్ని ధరించి, జ్వాల పైభాగాన్ని చూడడానికి ఆకాశానికి వెళ్లాడు, విష్ణువు వరాహ వరాహుడు మరియు దాని స్థావరాన్ని వెతకాడు. లింగోద్భవ అని పిలుస్తారు మరియు చాలా శివాలయాల గర్భగుడి వద్ద పశ్చిమ గోడలు జరుగుతున్నాయి.బ్రహ్మ లేదా విష్ణువు కూడా మూలాన్ని కనుగొనలేకపోయారు.