అనఘాష్టమి వ్రతం
శ్రీ మహాగణపతి పూజ (పసుపు గణపతి పూజ)
పునః సంకల్పం –
చూ. ||
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సంకల్పిత మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం సమస్తసన్మంగళావాప్త్యర్థం పురుషసూక్త విధానేన శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘాస్వామి షోడశోపచార పూజాం కరిష్యే ||
సిద్ధిదేవతా స్థాపనం –
(గమనిక: బియ్యపుపిండి, పసుపు, కుంకుమలతో అష్టదళ పద్మము వేసి, అందులో చెప్పబడిన స్థానములలో రెండు తమలపాకులు వేసి అందులో ఒక వక్క, ఒక ఖర్జూరం ఒక రూపాయి బిళ్ళ వేసి శ్లోకం చదివి అక్షతలు వేయండి)
స్మరణ –
అణిమా మహిమా ప్రాప్తిః ప్రాకామ్యం మహిమా తథా |
ఈశిత్వం చ వశిత్వం చ యచ్చ కామావసాయతా ||
అణిమా (ఈశాన్యం)
అణోరణీయసః పుత్రః ఈశాన్యాశా వ్యవస్థితః |
అనఘస్యాణిమాభిఖ్యః పుత్రశ్చిత్రః సనోఽవతు ||
అస్మిన్ అష్టదళపద్మే ఈశాన్యదళే కలశే అణిమాఖ్య దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(ఈశాన్య పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)
సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)
లఘిమా (ఆగ్నేయం)
అనఘానఘయోః పుత్రో లఘిమాఖ్య కృపాలఘుః |
దేవస్యాగ్నేయ కోణస్థో లఘుబుద్ధిః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే ఆగ్నేయ దళే కలశే లఘిమాఖ్య దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(ఆగ్నేయ పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)
సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)
ప్రాప్తి (నైఋతి
భక్తాభీష్టఫలప్రాప్తికారకోఽనఘయోః సుతః |
దేవస్య నైరృతే కోణే స్థితః ప్రాప్తిః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే నైఋతి దళే కలశే ప్రాప్తి దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(నైఋతి పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)
సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)
ప్రాకామ్య (వాయువ్యం)
అవధూత గురోః స్వేచ్ఛాసంచారస్యాఽనఘస్య యః |
వాయుకోణ స్థితః పుత్రః ప్రాకామ్యాఖ్యః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే వాయువ్య దళే కలశే ప్రాకామ్య దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(వాయువ్య పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)
సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)
ఈశిత్వ (దక్షిణం)
సర్వాతిశాయితాం దేవస్యాఽనఘస్య జగద్గురోః |
ఖ్యాపయన్ దక్షభాగస్థ ఈశిత్వాఖ్యః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే దక్షిణ దళే కలశే ఈశిత్వ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(దక్షిణ పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)
సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)
వశిత్వ (ఉత్తరం)
జగద్యస్య వశే తిష్ఠత్యనఘస్య మహాత్మనః |
ఆత్మజో వామభాగస్థో వశిత్వాఖ్యః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే వామభాగస్థ దళే కలశే వశిత్వ దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(ఉత్తరం పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)
సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)
కామావసాయత (పశ్చిమం)
కామావసాయితాభిఖ్యో హ్యనఘస్యాంగా రక్షవత్ |
పశ్చాద్భాగస్థితః పుత్రః కమనీయః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే పశ్చాద్భాగస్థ దళే కలశే కామావసాయితాఖ్యా దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(పశ్చిమం పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)
సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)
మహిమా (తూర్పు)
పురస్తాదనఘద్వంద్వ పాదసీమ్ని వ్యవస్థితః |
మహిమాఖ్యో మహాకార్యకారీ పుత్రః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే పురస్తాద్దళే కలశే మహిమాఖ్య దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
(తూర్పు పద్మదళంలో సిద్ధి స్థాపన చేయండి)
సకలపూజార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి |
(పుష్పాక్షతలు వేయండి)
దత్తాత్రేయః (మధ్యలో ఉన్న మొదటి ప్రధాన కలశం)
ఏవం తత్తత్సుతభ్రాజద్దళాష్టక సుశోభినః
కర్ణికాయాం పంకజస్య కలితాయాం మహాగుణైః |
సమాసీనః ప్రశాంతాత్మా కృపాబ్ధిరనఘాహ్వయః
దత్తాత్రేయో గురుర్విష్ణుబ్రహ్మేశాత్మా సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే మధ్యే కర్ణికాయాం ప్రధానకలశే శ్రీమదనఘస్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
అనఘాలక్ష్మీః (మధ్యలో ఉన్న రెండవ ప్రధాన కలశం)
అనఘస్వామినః పార్శ్వే సమాసీనా కృపాలయా
సర్వైర్బాహ్మ్యై గుణైర్యుక్తా యోగాధీశా జగత్ప్రసూః |
పద్మాసనా పద్మకరా భక్తాధీనా పతివ్రతా
అనఘాంబ మహాలక్ష్మీర్మహాభాగాః సనోవతు ||
అస్మిన్ అష్టదళపద్మే మధ్యే కర్ణికాయాం శ్రీమదనఘస్వామినః పార్శ్వే కలశే శ్రీమతీం అనఘాదేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి |
ప్రాణప్రతిష్ఠా –
ఈశాన్యామణిమాభిఖ్యే చాగ్నేయ్యాం లఘిమాభిదే |
ప్రాప్తి నామాని నైఋత్యాం ప్రాకామ్యాఖ్యేఽనిలస్థలే ||
ఈశిత్వాఖ్యే వశిత్వాఖ్యే చోభయోః పార్శ్వయోరపి |
కామావసాయితా నామ్ని పశ్చాద్భాగేంగ రక్షవత్ ||
మహిమ్నీ పాదమూలే చ దళేష్వష్టసు నిత్యశః |
భ్రాజమానేషు తన్మధ్యే కర్ణికాయాం కృతాలయౌ ||
అనఘశ్చాఽనఘాదేవీ ప్రాణ చేష్టా విరాజితౌ |
చరతాం మమ హృత్పద్మే గురుమార్గ ప్రవర్తకౌ ||
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్ |
తావత్త్వం ప్రీతిభావేన కుంభేఽస్మిన్ సన్నిధిం కురు ||
ధ్యానం –
పద్మాసనోత్తాన మనోజ్ఞపాదం
పద్మం దధానామభయం చ పాణ్యోః |
యోగస్థిరం నిర్భర కాంతిపుంజం
దత్తం ప్రపద్యేఽనఘ నామధేయమ్ || ౧ ||
పద్మాసనస్థాం పదయుగ్మ నూపురాం
పద్మం దధానామభయం చ పాణ్యోః |
యోగేఽర్ధ సమ్మీలిత నిశ్చలాక్షీం
దత్తానురక్తామనఘాం ప్రపద్యే || ౨ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ధ్యాయామి |
ఆవాహనం –
సహస్రశీర్షా పురుషః |
సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిo విశ్వతో॑ వృ॒త్వా |
అత్యతిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
గుణాతీతావపి స్వేషు కృపయా త్రిగుణాన్వితౌ |
అనఘామనఘం దేవం దేవీం చాఽఽవాహయామ్యహమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఆవాహయామి |
ఆసనం –
పురుష ఏవేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉతామృతత్వస్యేశానః |
యదన్నేనాతిరోహతి |
సౌవర్ణపీఠం కృష్ణత్వక్ చిత్రాసన కుశాసనైః |
ఆస్త్రుతం గృహ్యతాం దేవావనఘావర్పితం మయా ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఆసనం సమర్పయామి |
పాద్యం –
ఏతావానస్య మహిమా |
అత॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరుషః |
పాదో”ఽస్య॒ విశ్వా భూతాని॑ |
త్రిపాద॑స్యా॒మృత॑o దివి |
యోగిశీర్షేఽమృతాసారౌ జంభశీర్షేఽగ్నివర్షకౌ |
పాదౌ పాద్యేన హృద్యేన క్షాళయేఽనఘయోరహమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
త్రిపాదూర్ధ్వ ఉదై॒త్పురుషః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో విష్వ॒ఙ్వ్యక్రామత్ |
సాశనానశనే అభి |
పద్మేన మాలయా చాత్తౌ భక్తాభీతిప్రదాయకౌ |
అర్ఘ్యేణ శీతలీకుర్యామనఘాఽనఘయౌః కరౌ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
తస్మా”ద్వి॒రాడజాయత |
విరాజో అధి పూరుషః |
సజాతో అత్యరిచ్యత |
పశ్చాద్భూమిమథో॑ పు॒రః |
జ్ఞానజ్యోతిర్వినీతానాం వేదజ్యోతిశ్చ వేధసః |
యతోఽనఘముఖాద్వ్యక్తం తత్రాఽఽచమనమర్పితమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం –
అనఘౌ యౌ శ్రిత పరీక్షార్థం మాయా మధుస్పృశౌ |
మధుపర్కం దదే తాభ్యాం తత్పాదాబ్జ మధువ్రతః ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృత స్నానం –
యౌ కృపాప్రేరితౌ భక్తప్రపంచేఽమృత వర్షకౌ |
పంచామృతైస్తౌ స్నపయామ్యనఘావమృతాఽత్మకౌ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి |
శుద్ధోదక స్నానం –
యత్పురుషేణ హవిషా” |
దేవా యజ్ఞమతన్వత |
వసన్తో అస్యాసీదాజ్యమ్” |
గ్రీష్మ ఇధ్మశ్శ॒రద్ధ॒విః |
మాతృతీర్థాత్ పద్మతీర్థాత్ సర్వతీర్థాదనేకతః |
సమానీతైః శీతలోదైః స్నపయామ్యనఘావుభౌ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |
వస్త్రం –
సప్తాస్యాసన్పరిధయ: |
త్రిః సప్త సమిధ॑: కృ॒తాః |
దేవా యద్య॒జ్ఞం తన్వా॒నాః |
అబధ్న॒న్పురుషం పశుమ్ |
వల్కలే రుచిరే సూక్ష్మే చిత్ర చిత్ర దశాంచితే |
మాయాఽఽవృతిచ్ఛేదకాభ్యాం అనఘాభ్యాం దదే ముదా ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః వస్త్రం సమర్పయామి |
ఉపవీతం –
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్॑ |
పురుషం జాతమగ్ర॒తః |
తేన దేవా అయజన్త |
సాధ్యా ఋషయశ్చ॒ యే |
ఉపవీతం పవిత్రం చ సహజం యత్ప్రజాపతేః |
సమర్పితం మయా శుభ్రమనఘౌ ప్రతిముంచతమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఉపవీతం సమర్పయామి |
గంధం –
తస్మా”ద్య॒జ్ఞాత్సర్వ॒హుత॑: |
సంభృతం పృషదాజ్యమ్ |
పశూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయవ్యాన్॑ |
ఆరణ్యాన్గ్రామ్యాశ్చ॒ యే |
మిలత్ కర్పూర సద్గంధైరనులిప్యాఽనఘాఽనఘౌ |
ముఖయోరలికే కుర్యాం లసత్ ఫాలాక్షి సన్నిభే ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః గంధాన్ ధారయామి |
గంధస్యోపరి అలంకరణార్థం కుంకుమం అక్షతాంశ్చ సమర్పయామి |
ఆభరణం –
తస్మా”ద్య॒జ్ఞాత్సర్వ॒హుత॑: |
ఋచ: సామాని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే తస్మా”త్ |
యజుస్తస్మాదజాయత |
శీర్షే కంఠే బాహుయుగ్మే మణిబంధద్వయే తథా |
వివిధా అక్షమాలాస్తే భూషార్థం కల్పయేఽనఘ ||
పాదాంగుళీయ కటక కాంచీ మాంగళ్య హారకాన్ |
కంకణం నాసికా భూషాం తాటంకే తే దదేఽనఘే ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ఆభరణాని సమర్పయామి |
హరిద్రాచూర్ణం –
హరస్యార్ధశరీరాంగే హంసరూపీ యతీశ్వరీ |
హస్తముద్రాం కుశాధారే హరిద్రాన్ మాతృకార్చయేత్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః హరిద్రాచూర్ణం సమర్పయామి |
కుంకుమం –
దేవి త్వామనఘే భద్రే సర్వమంగళమంగళే |
లసత్ కుంకుమచూర్ణేన పూజయామి ప్రసీద మే ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః కుంకుమం సమర్పయామి |
పుష్పం –
తస్మా॒దశ్వా అజాయన్త |
యే కే చో॑భయాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే తస్మా”త్ |
తస్మా”జ్జాతా అ॑జావయ॑: |
తత్తత్ కాలోత్థ పుష్పౌఘ మాలాభిరనఘాఽనఘౌ |
ఆపాదశీర్షం సంభూష్య పునః పుష్పైః సమర్చయే ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః పుష్పాణి సమర్పయామి |
అథ శ్రీఅనఘస్వామినః అంగపూజా –
శ్రీ అనఘదేవాయ నమః – పాదౌ పూజయామి |
శ్రీ త్రిజగత్ సంచారాయ నమః – జంఘే పూజయామి |
శ్రీ ఆజానుబాహవే నమః – జానునీ పూజయామి |
శ్రీ పద్మాసనస్థాయ నమః – ఊరూ పూజయామి |
శ్రీ త్రిగుణేశాయ నమః – వళిత్రయం పూజయామి |
శ్రీ శాతోదరాయ నమః – ఉదరం పూజయామి |
శ్రీ కరుణాకరాయ నమః – హృదయం పూజయామి |
శ్రీ భక్తాలంబనాయ నమః – బాహూ పూజయామి |
శ్రీ సంగీతరసికాయ నమః – కంఠం పూజయామి |
శ్రీ జగన్మోహనాయ నమః – మందస్మితం పూజయామి |
శ్రీ జగత్ప్రాణాయ నమః – నాసికాం పూజయామి |
శ్రీ శ్రుతిసంవేద్యాయ నమః – శ్రోత్రే పూజయామి |
శ్రీ ధ్యానగోచరాయ నమః – నేత్రద్వయం పూజయామి |
శ్రీ తిలకాంచితఫాలాయ నమః – ఫాలం పూజయామి |
శ్రీ సహస్రశీర్షాయ నమః – శిరః పూజయామి |
శ్రీ సచ్చిదానందాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |
అథ శ్రీఅనఘాదేవ్యాః అంగపూజా –
శ్రీ అనఘాదేవ్యై నమః – పాదౌ పూజయామి |
శ్రీ త్రిజగత్ సంచారాయై నమః – జంఘే పూజయామి |
శ్రీ ఆజానుబాహవే నమః – జానునీ పూజయామి |
శ్రీ పద్మాసనస్థాయై నమః – ఊరూ పూజయామి |
శ్రీ త్రిగుణేశాయై నమః – వళిత్రయం పూజయామి |
శ్రీ శాతోదరాయై నమః – ఉదరం పూజయామి |
శ్రీ కరుణాకరాయై నమః – హృదయం పూజయామి |
శ్రీ భక్తాలంబనాయై నమః – బాహూ పూజయామి |
శ్రీ సంగీతరసికాయై నమః – కంఠం పూజయామి |
శ్రీ జగన్మోహనాయై నమః – మందస్మితం పూజయామి |
శ్రీ జగత్ప్రాణాయై నమః – నాసికాం పూజయామి |
శ్రీ శ్రుతిసంవేద్యాయై నమః – శ్రోత్రే పూజయామి |
శ్రీ ధ్యానగోచరాయై నమః – నేత్రద్వయం పూజయామి |
శ్రీ తిలకాంచితఫాలాయై నమః – ఫాలం పూజయామి |
శ్రీ సహస్రశీర్షాయై నమః – శిరః పూజయామి |
శ్రీ సచ్చిదానందాయై నమః – సర్వాణ్యంగాని పూజయామి |
అథ అష్టోత్తరశతనామ పూజా –
శ్రీ అనఘదేవ అష్టోత్తరశతనామావళి చూ. |
శ్రీ అనఘాదేవీ అష్టోత్తరశతనామావళి చూ. |
ధూపం –
యత్పురుషo వ్యదధుః |
కతిధా వ్యకల్పయన్ |
ముఖ॒o కిమస్య॒ కౌ బా॒హూ |
కావూరూ పాదావుచ్యేతే |
నానా పరిమళద్రవ్య సమ్మేళన మనోహరః |
ధూపః సమర్పితో దేవావనఘౌ ప్రతిగృహ్యతామ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ధూపమాఘ్రాపయామి |
దీపం –
బ్రాహ్మ॒ణో”ఽస్య॒ ముఖమాసీత్ |
బాహూ రాజన్య: కృ॒తః |
ఊరూ తదస్య॒ యద్వైశ్య: |
పద్భ్యాగ్ం శూద్రో అజాయత |
యద్భాసేదం జగద్భాతి న దృశ్యేతే తథాపి యౌ |
తావుభౌ తత్త్వసందీప్త్యై దీపైరుద్దీపయామ్యహమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః దీపం దర్శయామి |
ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
నైవేద్యం –
చన్ద్రమా మనసో జాతః |
చక్షో॒: సూర్యో అజాయత |
ముఖాదిన్ద్రశ్చా॒గ్నిశ్చ |
ప్రాణాద్వా॒యుర॑జాయత |
రాజాన్నం బహుభక్ష్యాత్తం నానోపస్కార పుష్కలమ్ |
నైవేద్యం శ్రుతిసంవేద్యౌ గృహ్యతామనఘౌ ముదా ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువస్సువ: | తత్సవితు॒ర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య ధీ॒మహి |
ధియో యో న: ప్రచోదయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృ॒తోపస్తర॑ణమసి |
ఓం ప్రాణాయ స్వాహా” | ఓం అపానాయ స్వాహా” | ఓం వ్యా॒నాయ స్వాహా” |
ఓం ఉదానాయ స్వాహా” | ఓం సమానాయ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అమృ॒తాపిధానమసి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి ||
తాంబూలం –
నాభ్యా ఆసీదన్తరిక్షమ్ |
శీ॒ర్ష్ణో ద్యౌః సమవర్తత |
ప॒ద్భ్యాం భూమిర్దిశ: శ్రోత్రా”త్ |
తథా లోకాగ్ం అ॑కల్పయన్ |
అనఘ స్వామి జనకప్రోద్ధృతాయుష్య తంత్రకే |
ప్రోక్తైః సులక్షణైర్యుక్తం తాంబూలం ప్రదదేఽనఘౌ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
వేదాహమేతం పురుషం మహాన్తమ్” |
ఆదిత్యవర్ణం తమస॒స్తు పా॒రే |
సర్వాణి రూపాణి విచిత్య॒ ధీర: |
నామాని కృ॒త్వాఽభివదన్ యదాస్తే” |
ప్రభో సమంతాత్ పరివర్తితైః శ్రీ
కర్పూర నీరాజన దీప మాల్యైః |
యుష్మన్ మహార్చిః పరివేష పంక్తిః
కిమ్మీరితాభాస్త్వనఘేఽనఘ ప్రభో ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః నీరాజనం సందర్శయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి |
మంత్రపుష్పం –
ధాతా పు॒రస్తాద్యముదాజహార |
శక్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చతస్రః |
తమేవం విద్వానమృత॑ ఇ॒హ భవతి |
నాన్యః పన్థా అయనాయ విద్యతే |
ఓం దిగంబరాయ విద్మహే అత్రిపు॒త్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయా”త్ ||
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుప॒త్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచో॒దయా”త్ ||
ఓం ఐం హ్రీం శ్రీం శివ రామ అనఘ దత్తాయ నమః |
యౌ వేధసే ప్రబలమానసదోషజాల
మున్మూల్యసత్వరమభాసయతాం హి వేదాన్ |
తావద్య కేళిశునకీకృతవేదజాతౌ
శ్రీమంత్రపుష్పనిచయైరనఘౌ నిషేవే ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణ –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ||
కార్తవీర్యాఽజ నహుజ భార్గవేంద్రాది రక్షకౌ |
అనఘౌ లోకపితరౌ తుష్యేతాం మే ప్రదక్షిణైః ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
ఉపచార పూజా –
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః
ఛత్రమాచ్ఛాదయామి | చామరైర్వీజయామి |
నృత్యం దర్శయామి | గీతం శ్రావయామి |
వాద్యం ఘోషయామి | ఆందోళికానారోహయామి |
అశ్వానారోహయామి | గజానారోహయామి |
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార పూజాః సమర్పయామి ||
ప్రార్థనా –
మనోవాక్కాయోత్థం క్షపితుమఘమాత్మీయవితతే-
-ర్ధృతం నూనం యాభ్యాం విమలమిహ దాంపత్య లసనమ్ |
తయోః పాదద్వంద్వం మహిమముఖపుత్రాష్టక లస-
-త్పరీవారం వందే సతతమనఘాఖ్యా కలితయోః ||
విష్ణోఽనఘ దత్తేశ్వరాఽనఘే లక్ష్మి మంగళే |
ఉభౌ హి సచ్చిదానందవిగ్రహౌ భక్తరక్షకౌ ||
యువాం మే తుష్యతాం అద్య పూజయా సుప్రసీద తామ్ |
జ్ఞాతాఽజ్ఞాతాపరాధాన్ మే క్షమ్యతాం కరుణాకరౌ |
ఆయురారోగ్యమైశ్వర్యం సత్కుటుంబప్రవర్ధనమ్ |
సౌమాంగళ్యం యశో విద్యాం జ్ఞానం చ దిశతాం ముదా ||
తోరబంధనం –
బ్రహ్మవిష్ణుమహేశాన రూపిన్ త్రిగుణనాయక |
త్రైవర్ణిక నమస్తుభ్యం తోరదేవాఽనఘాత్మక ||
వ్రతకథా (అనఘాష్టమీ వ్రత మాహాత్మ్యము)
అనఘాష్టమి వ్రత మాహాత్మ్య వర్ణనము శ్రీవేదవ్యాస మహాముని అనుగ్రహించిన శ్రీభవిష్య మహాపురాణములోని ఉత్తరపర్వములో ఉన్నది.
దీపకుడు తన గురువుగారికి నమస్కరించి ఈ విధముగా అడిగెను. “ఓ గురుదేవా! పూర్వము జంభుడను దైత్యుడు దేవతలను ఓడించెనని, తరువాత శ్రీదత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించెనని విన్నాను. అయితే శ్రీదత్తుల వారు అతనితో నిజముగా యుద్ధము చేసెనా లేక యోగబలముచే జయించెనా? నా ఈ సందేహమును నివృత్తిచేసి నాకు జ్ఞానోదయము చేయవలసినది.” అందులకు శ్రీగురు ఈ విధముగా పలికెను. “ఇదే ప్రశ్నను పూర్వము యుధిష్ఠిరుడు వాసుదేవుని అడుగగా, ఆ శ్రీకృష్ణుడు చెప్పినదానిని నీకు చెప్పెద, శ్రద్ధగా వినుము” అనెను.
– దత్త అవతారం –
శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. “బ్రహ్మపుత్రుడైన అత్రి మహాతేజోశాలి మరియు గొప్ప ఋషి. ఆయన పత్నియగు అనసూయా గొప్ప పతివ్రత. వారికి కాలాంతరమున దత్త నామముగల మహాత్ముడు పుట్టెను. ఆయన మహాతపస్సు చేయగల మహాయోగి. ఆయన విష్ణువు యొక్క అంశతో భూమిమీద ఉద్భవించెను. ఆయనకు ప్రతిగా లోకమున ఎవ్వరూ లేరని యెరుంగుము. ఆయన భార్య పేరు అనఘా. ఆవిడ ఎల్లపుడు పతిని అనుసరిస్తూ ఉండెను. వారి ఎనిమిది మంది పుత్రులు సర్వబ్రహ్మగుణములు కలిగి ఉండెను. అనఘ విష్ణురూపమని, లక్ష్మీరూపము అనఘా అని తెలుసుకొనుము. అనఘుడు తన భార్యతో కలసి యోగావిద్యను అభ్యసించుచూ ఉండెడివారు.
– జంభాసుర యుద్ధ వృత్తాంతం –
ఇలా ఉండగా, జంభ అను దైత్యునిచే దేవతలు పీడింపబడుట సంభవించినది. బ్రహ్మ వలన లభించిన వరప్రసాదమున జంభుడు, అమరావతికి వెళ్ళి నూరు దివ్యవర్షములు యుద్ధము చేసెను. ఈ సంగ్రామములో పాతళలోకములోని రాక్షసులను కుడా కలిసిరి. అసంఖ్యేయమగు దైత్య దానవ రాక్షస సైన్యముతో యుద్ధము జరుగుచుండెను. వారిచే ఓడింపబడిన ఇంద్రుడు మరియు మరుద్గణాది దేవతలు తమ స్థానములు విడిచి పది దిక్కులకు తరిమివేయబడితిరి. ముందువైపు ఇంద్రాది దేవతలు భయముతో పలాయనము చేయుచుండ వెనుకగా జంభ దైత్యుడు వెంబడించుచుండెను. బాణ సంఘాతములతో, గదా ముసల ముద్గరాది ఆయుధములతో దైత్యులు పోరాటము చేయుచుండిరి. అడవిదున్నలపై, గేదెలపై, పులులపై, కోతులపై, మరియు ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండరాళ్ళను, శరములను కురిపిస్తూ వెంబడించెను.
అలా దేవతలు వింధ్యగిరిపై అనఘ మరియు అనఘా దంపతులు నివసిస్తున్న ఆశ్రమమునకు చేరెను. అక్కడకు చేరుకున్న అమరులు వారిని శరణు కోరుతూ ఇట్లనెను – “ఓ దేవదేవా! జగన్నాథా! శంఖచక్రగదాధరా! పాహి పాహి! ఆపదలో ఉన్న మాకు శరణమును ఇవ్వుము. జంభదైత్యుని చేతిలో మాకు పరాజయము వచ్చినది. మీ చరణ పద్మములు కాక సురులకు, భక్తులకు ఇంకేమియును గతి లేదు. కావున ఓ బ్రహ్మన్! దేవతలమైన మేము మీ ఆశ్రయమునకు వచ్చితిమి.”
వారి ఈ విలాపమును అజుడగు ఆత్రేయ భగవానుడు విని, తన దేవియగు అనఘా వైపు లీలగా చూచెను. విగతజ్వరముతో వచ్చి ఉన్న అందరు దేవతలకు అలాగేయని అనుమతినిచ్చి తుష్టిపరిచెను. ఇంతలో అక్కడకు దైత్యులు ప్రహరణము చేయుచూ వచ్చిరి. అక్కడ ఉన్న బ్రాహ్మణిని (అనఘాదేవిని) చూచి ఆమె అందమునకు పరవశులై, మదము నిండిన చిత్తముతో, ఈమెకు పువ్వులు పండ్లు ఇచ్చెదమని ఎత్తుకుపోసాగిరి.
ఇది గమనించిన దత్తులవారు తన ధ్యానాగ్నిచే వారిని స్తంభింపచేసెను. అనఘాదేవి తన తపోశక్తిచే దైత్యులను శక్తిహీనులుగా చేసెను. నిస్తేజముతో శక్తి క్షీణించిన దైత్యులను చూచి దేవతలు వారిపై ప్రహరణము చేసిరి. కత్తులతో, శూలములతో, త్రిశూలములతో, గదలతో దేవతలు దాడిచేయుచుండ, ఆ బాధ భరింపలేక దైత్యులు రోదనము చేసిరి.
అసురులు దేవ శస్త్రములచే, మరియు జంభుడు ఇంద్రునిచే సంహరింపబడెను. అటు తరువాత దేవతలు తమ స్వరాజ్యమునకు మరియు అందరు తమ నిజపురములకు చేరుకొనెను. ఈ మహిమను సురులు, మునులు, దేవర్షులు కొనియాడిరి.”
– కార్తవీర్యార్జున కథ –
శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఈ విధముగా పలికెను – “ఆ దత్తులవారు తన కర్మలచేత, మనస్సుచేత, వాక్కుచేత సర్వలోకములకు శుభములు కలిగించుచుండెను. ఆ మహాతపశ్శాలి ఊర్ధ్వబాహువులతో కట్టెవలె, ఒక రాయివలె చలనము లేకుండా, నియమములు పాటించుచూ తపస్సు చేయసాగెను. కనులతో భ్రుకుటి మధ్య స్థానమును చూచుచూ మూడువేల దివ్యవర్షములు స్థిరముగ తపస్సు చేయసాగెను.
అలా ఊర్ధ్వరేతస్కుడై, యోగస్థితిలో ఉన్న ఆయన వద్దకు మాహిష్మతి రాజు అయిన కార్తవీర్యార్జునుడు వచ్చెను. రాత్రింబవళ్లు అలుపులేక వినయముగా శుశ్రూష చేయసాగెను. గాత్రముతో పూజను, మానసికముగా చింతన చేయుచూ, సంపూర్ణ నియమములు పాటిస్తూ ఆనందముగా సపర్యలు చేసెను.
అందులకు సంతోషించిన దత్తులవారు ఆతనికి వరములు కోరుకోమని అడుగగా, కార్తవీర్యార్జునుడు నాలుగు వరములు కోరెను. మొదటి వరముగా సహస్రబాహువులును, రెండవ వరముగా అధర్మమార్గమున వెళ్ళకుండా ధర్మము వైపు ఉండుటకు సరైన మార్గదర్శనమును, మూడవ వరముగా పృథివిని మొత్తము ధర్మమార్గమున గెలిచి ధర్మముగా యేలుటయును, నాల్గవ వరముగా సంగ్రామమున మహాయోద్ధుని చేతిలో మాత్రమే వీరమరణము పొందుటయను వరములు కోరెను. అందులకు దత్తులవారు ఆనందముగా వరములనిచ్చి, విస్తారమైన రాజ్యమును, అద్వితీయమగు యోగవిద్యను ప్రసాదించెను.
అటుపిమ్మట ఆ రాజు చక్రవర్తిత్వమును, అష్టసిద్ధులను పొంది, ఏడు ద్వీపములు, పర్వతములు కలిగిన పృథివి మొత్తమును తన సహస్రబాహువుల ప్రభావముతో ధర్మముగా జయించెను. అన్ని ద్వీపములలో పదివేల యజ్ఞములు చేయుచూ ఆ మహాబాహువు అందరికీ ఘనముగా దక్షిణలు, బహుమతులు ఇచ్చెను. అన్ని యజ్ఞ వేదికలను స్వర్ణ స్థంభములతో శోభాయమానముగా అలంకరింపజేసెను. గంధర్వులు మరియు అప్సరసల నిత్య గాన నాట్యములతో యజ్ఞవాటికలు శోభిల్లెను.
ఆ రాజసింహుని చరితమును, మహిమను చూచి కార్తవీర్యుని మించి లోకమున వేరొకరు లేరని అనిపించెను. యజ్ఞములు, దానములు, తపముల చేత విక్రముడివలె ప్రశంసింపబడెను. తన ఖడ్గముతో, శరములతో తన యోగశక్తిచే ఏడు ద్వీపములు తిరుగుచూ చూచుచుండెను. ఆ రాజు ప్రభావము చేత రాజ్యమున ద్రవ్యనష్టము, శోకము, అనారోగ్యములు లేక ప్రజలు ధర్మము వలన రక్షింపబడుచుండిరి. ఎనభైఅయిదు వేల సంవత్సరములు పాలించుచూ ఆ నరాధిపుడు (రాజు) చక్రవర్తివలె పశువులను, క్షేత్రములను, పాలించెను. ఆ అర్జునుడి యోగశక్తి వలన పర్జన్యుడు వృష్టిని ఇచ్చెను (వానలు కురిసెను). తన సహస్ర బాహువులతో సముద్రములను శోషింపజేయు వేయి సూర్యులవలె ప్రకాశించెను. కర్కోటకుడు ఉన్న పురమును జయించెను.
క్రీడావిలాసమున నర్మదా నదిలో ఎదురీత చేయుచూ నదిని ఆడ్డగింప, ఆతని ధాటికి జలము పీడనమునకు గురి అయి అందమైన స్త్రీ వలె దూరముగా జరిగెను (వెనుకకు ప్రవహించినది). తన సహస్రబాహువుల తాడనము వలన సాగరము అల్లకల్లోలమై, మహాతిమింగిలములు మృతిచెంది, పాతాళమున గల అసురులు నిశ్చేష్టులాయిరి.
రావణుడను వశపరుచుకుని మాహిష్మతిలో బంధించెను. తరువాత పులస్త్య ఋషి అభ్యర్థనను గౌరవించి రావణాసురుని విడిచెను. కానీ విడుదల అయిన రావణుడు (అవమానభారముతో) పులస్త్యుని నిందించెను.
ఒకసారి ఆకలి వలన భిక్షకు వచ్చిన చిత్రభానునికి (అగ్నిదేవునికి) సప్తద్వీపములలోని పంటలను, లతలను, వృక్షములను భిక్షగా ఇచ్చెను. ఇటువంటి గుణములు కార్తవీర్యార్జునునకు కేవలము యోగాచార్యుడైన అనఘదేవుని కృప వలన మాత్రమే కలిగెను. అలాంటి యోగి వరము లభించిన కార్తవీర్యుని వలన మర్త్యలోకమున అనఘాష్టమీ వ్రతము ప్రసిద్ధి చెందెను.
– అనఘ నామ వివరణ –
అఘము అనగా పాపము. లోకములో అఘము మూడు విధములుగా కలుగును (చిత్తము, వాక్కు, కర్మలు) అలాంటి అఘమును నాశనము చేయువాడు అనఘుడని తెలుసుకొనుము. అనఘుని విధివిధానమున అర్చించిన అష్టగుణములు, అష్టైశ్వర్యములు కలుగును. అణిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమా, ఈశిత్వ, వశిత్వ, కామావసాయితా అను ఎనిమిది యోగసిద్ధులను అర్చించుట వలన మోక్షలక్షణములు సిద్ధించును. కావున భక్తితో దత్తనామమును స్వీకరించిన అఘములు అంతమగును. జగత్తును అఘరహితముగా చేయు అనఘుడు (దత్తులవారు) నా అంశయే యని తెలుసుకొనుము.”
– అనఘాష్టమీ వ్రత విధానం –
ఇది వినిన యుధిష్ఠిరుడు ఇటుల పలికెను – “ఓ పుండరీకాక్ష! ఈ సర్వరాజు అయిన (కార్తవీర్య) అర్జునుడు చేసిన వ్రతము యేమిటో, వాటి మంత్రములు, సమయములు, యే కాలమునందు, యే తిథులలో చేయవలెనో నాకు చెప్పుము కేశవ.” అనెను.
అందులకు శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పసాగెను – “మార్గశీర్ష మాసములో కృష్ణ పక్షములో వచ్చు అష్టమి తిథియందు, బహుపుత్రులతో కలిసియున్న అనఘ మరియు అనఘా దంపతులను, ముందుగా శాంతపరిచిన (శుద్ధిచేసిన) భూమిభాగమునందు, అష్టపత్రముల (చిత్రము) యందు కలశములలో గానీ, పద్మములయందు గానీ, లేక దర్భలయందు గానీ స్థాపించి పూజింపవలెను. ముందుగా స్నానమాచరించి, పుష్పములు మరియు సుగంధములతో, విష్ణువును ధ్యానించి, ఋగ్వేదములోని ఋక్కులతో అర్చింపవలెను.
వాసుదేవుని అంశ అయిన అనఘుని, లక్ష్మి అంశ అయిన అనఘాని, హరివంశములో చెప్పబడిన ప్రద్యుమ్నాదులను వారి పుత్రవర్గమని భావించి అర్చింపవలెను.
ముందుగా శూద్రులకు, విప్రులకు నమస్కరించి, ఆ కాలములో లభించు మంచి ఫలములు, కందములు, శృంగాటములు (సింగడులు), రేగులు మొదలగు వివిధ నైవేద్యములను, గంధ, ధూప, దీపాదులతో సమర్పింపవలెను. అటు తరువాత ద్విజులతో, సంబంధీకులతో మరియు బంధువులతో భోజనము చేయవలెను.
వ్రతము చివరిలో కనీసము యే ఒక్కరినైనా ఈ వ్రతము చేయుటకు ప్రేరేపింపవలెను. ఈ వ్రతము ఆజీవనము చేయదగునది అను సత్యమును నేను చెప్పుచున్నాను. కనీసం ఒక సంవత్సరమైనా చేయవలెను. ఆ రాత్రి (భగవత్సంబంధమైన) నటనము, నాట్యము, గానము మొదలగువాటితో జాగరణ చేసి, నవమి నాటి ప్రభాత సమయములో (దేవతా ప్రతిమలను) నీటిలో విసర్జనము చేయవలెను.
ఇట్లు యెవరైతే భక్తి యుక్తులతో శ్రద్ధగా ప్రతి సంవత్సరము చేయునో, వారు సర్వపాపములనుండి విడుదల పొందెదరు. కుటుంబము వర్ధిల్లును. విష్ణువు వారిపట్ల ప్రసీదుడగును. ఏడు జన్మలవరకు ఆరోగ్యము కలిగి, తదుపది పరమ గతిని పొందును.
ఓ కౌంతేయా (ధర్మరాజా) ! అఘమును శమింపు ఈ అనఘాష్టమి వ్రతమును నేను చెప్పిన విధముగా చేయువారు, కృతవీర్యుని (కార్తవీర్యార్జునుడు) వలె యశోవంతులగుదురు.”
శ్రీగురువు పలికెను – “దత్త కథనము నీకు చెప్పితిని. జంభుని పరాజితునిజేసి దేవతలకు రక్షణనిచ్చిన కథను, ఆ యోగి యొక్క యోగచర్యలను, అనఘ నామ వివరణము, అనఘుడు సంతోషించి భక్తులకు వరములనిచ్చు వ్రతమును చెప్పియున్నాను.” అని చెప్పి ముగించెను.
సమర్పణం –
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||
అనయా మయా కృతేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||
మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు |
తీర్థం –
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణమ్ |
సమస్తపాపక్షయకరం శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామి పాదోదకం పావనం శుభమ్ ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి ||
ఉద్వాసనం –
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః
తాని ధర్మాణి ప్రథమా న్యాసన్ |
తేహనాకం మహిమానస్సచంతే
యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః ||
శ్రీఅనఘాదేవి సమేత శ్రీఅనఘస్వామినే నమః యథాస్థానం ఉద్వాసయామి ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||