బిర్లా మందిర్ హైదరాబాద్

Sample Image

హైదరాబాద్ నగరంలో బిర్లా ఫౌండేషన్ వారిచే నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం పూర్తిగా పాలరాతితో నిర్మించారు. హుస్సేన్ సాగర్ కి దక్షిణ దిక్కున ఒక జంట కొండ పై వున్నది. ఇది నౌబత్ పహాడ్ యొక్క జంట కొండ అయిన కాలా పహాడ్ పైన ఉంది. ఈ ఆలయాన్ని1966 నుండి 1976 వరకు నిర్మించారు. ఈ ఆలయాన్ని1976 లో రామకృష్ణ ఆశ్రమానికి చెందిన స్వామి రంగనాథనంద స్వామి వారు ప్రారంబించారు. ఈ ఆలయాన్ని ప్రారంభించినప్పుడు ఆకాశము నుండి దేవతలు పూలు వేసినట్లు హెలికాఫ్టర్ ద్యారా పూలు వేశారు. గర్భగుడి పైన నిర్మించిన జగదానంద విమానం ఆలయ శిల్పకళ యొక్క ఒరియా శైలిని పోలి ఉంటుంది. అలాగే బుద్ధుని జీవితం మరియు అతని రచనలను వివరించే చిత్రాలతో కూడిన బుద్ధ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు, గణేష్, సరస్వతి, హనుమంతుడు, బ్రహ్మ, లక్ష్మి, సాయిబాబా వంటి ఇతర దేవతల కొరకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి.

ఈ ఆలయంలో స్వామి వారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర్ స్వామి వారిని పోలినట్టు వుంటారు.ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నంతసేపు మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ స్వామి వారి దర్శనార్థం ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయం ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల సందడి తోటి ఉంటుంది. హైదరాబాద్ లోని అత్యంత అందమైన దేవాలయాలలో ఒకటి.

చరిత్ర:

బిర్లా మందిర్ ను కాలా పహాడ్ అనే కొండా మీద కట్టారు. ఈ కొండను తెలుగులో నీలాద్రి కొండా అని కూడా అంటారు దీని ఎత్తు 300ల అడుగుల ఎత్హు. నౌబత్ పహాడ్ అనే పేరు వెనుక అనేక కథల వున్నాయి నౌబత్ అంటే పెద్ద ఢంకా అని అంటారు ఆ కొండ మీద ఈ ఢంకా మ్రోగించి అప్పటి నవాబు పరమనాలు చాటింపు వేశేవారు అందుకే ఈ కొండకు నౌబత్ పహాడ్ అనే పేరు వచ్చింది. ఇదంతా ఈ కొండల వెనుక వున్నా కారణాలు. బిర్లా మందిర్ కట్టకా అది పర్యాటక ప్రాంతం అయ్యిందనుకుంటారు. కానీ అది పొరపాటు బిర్లా మందిర్ కట్టక ముందు నుండే ఆ ప్రదేశం ప్రముఖ పర్యాటకకేంద్రనిగా ఉండేది. పర్యాటకంతో ఎంతో రద్దీగా వుండే ఈ ప్రదేశం 1960వ దశకంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నదని చాల మందికి తెలియదు. అంతే కాదు యిక్కడ సినిమా షూటింగులు కూడా చేసేవారు. ఇక్కడ కేవలం తెలుగు సినిమాలే కాకుండా హిందీ సినిమాలు కూడా షూటింగ్ చేసేవారు. నౌబత్ పహాడ్ మీద 1980 నుండి 1985 వరకు బిర్లా ప్లాంటోరియం నిర్మించారు. అప్పటి నుండి సినిమా షూటింగులు ఆపేశారు.