దశావతార వెంకటేశ్వర స్వామి, నంబూరు
దేశంలో శ్రీభూదేవిసమేత దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో అమరావతి నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా నిర్మించిన ఆలయం ఒకటి. ఇది ప్రప్రథమ అతిపెద్ద 11 అడుగుల దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కొలువై ఉన్న ఏకశిలా వెంకన్నను దర్శించుకునేందుకు రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. గుంటూరు, విజయవాడ మధ్యనున్న నంబూరు గ్రామ పరిధిలో లింగమనేని ఎస్టేట్స్ వారి నాలుగు ఎకరాల స్థలంలో. శ్రీభూసమేత దశావతార వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు. 2018, జూన్ 22న అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించారు. ఈ ఆలయంలో దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సుమారు 27 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి.
ఇక్కడ మహా గణపతి, మహాలక్ష్మి, గరుడ, ధ్వజ, రాజగోపుర, ఆలయ విమాన కలశాధిపతులను కూడా ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో తిరుమల శ్రీవారి పాదాలతోనూ, మోకాళ్ల వరకూ మత్స్యావతారంలో, నడుము వరకూ కూర్మావతారంలోనూ స్వామి వారు దర్శనమిస్తారు. శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖంగా ఉండగా.. ఈ విగ్రహం ఎనిమిది చేతులతో భక్తులను పరవశించ చేస్తోంది. వామనావతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, అలాగే రామావతారానికి సూచికగా బాణం, విల్లుమ్ములు, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం.. విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖు, చక్రాలు మరో రెండు చేతులకు అలంకరించారు. ఇలా దశావతారాలన్నింటిని ఒకే దగ్గర దర్శించుకోవటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
ఈ ఆలయ ప్రాంగణంలో ఏకకాలంలో శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారితో పాటు మహా గణపతి, మహాలక్ష్మి, గరుడ, ధ్వజ, రాజగోపుర, ఆలయ విమాన కలశాది పతులను కూడా ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో తిరుమల శ్రీవారి పాదాలతోనూ, అలాగే మోకాళ్ల వరకూ మత్స్యావతారంలో, నడుము వరకూ కూర్మావతారంలోనూ స్వామి వారు దర్శనమిస్తారు. ఇక శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖంగా ఉండగా ఈ విగ్రహం ఎనిమిది చేతులతో భక్తులను పరవశించ చేస్తోంది. వామనావతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, అలాగే రామావతారానికి సూచికగా బాణం, విల్లుమ్ములు, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం.. విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖు, చక్రాలు మరో రెండు చేతులకు అలంకరించారు. ఇలా దశావతారాలన్నింటిని ఒకే దగ్గర దర్శించుకోవటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.. ఇక్కడి స్వామి వారి శిల్పం కర్నూలుజిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి సుబ్రమణ్య ఆచార్యులు తయారు చేశారు. ఈ ఆలయాన్ని గుంటూరు సమీపంలోని పెదకాకాని మండలంలోని నంబూరు పంచాయతీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్స్‌లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయంలోని దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠను 2018, జూన్ 22న అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి మరో నాలుగు ఉపాలయాలు మహాలక్ష్మి, గణపతి, గరుడ ఆళ్వార్, విష్వక్సేనుడు ఉండటంతో దీనిని శ్రీ దశావతార శ్రీనివాస క్షేత్రంగానూ పిలుస్తున్నారు.