సంఘి దేవాలయం
సంఘి దేవాలయం, తెలంగాణ రాష్టంలోని సంఘి నగర్ లో నెలకొని ఉన్నది. ఇది హైదరాబాదు నగరానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్నది. ఈ దేవాలయం యొక్క చాలా ఎత్తైన పవిత్రమైన రాజా గోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుండి చూడవచ్చు. ఈ దేవాలయ సముదాయం పరమానంద గిరి కొండ పైన ఉంది, ఇది భక్తులను ఆకర్షిస్తుంది.
అందమైన కొండల మద్య ఉండడం వల్ల ఈ దేవాలయం చాల ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.
వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, స్వామి వారి విగ్రహం రమణీయంగా ఉంటాయి. ఇక్కడ చాల చిన్న ఉపలయాలు కూడా ఉన్నాయి.
పద్మావతి అమ్మవారి ఆలయం
1. శివాలయం
2. రామాలయం
3. ఆంజనేయ స్వామి వారి ఆలయం
4. విగ్నేశాలయం
5. నవగ్రహ
6. అష్టలక్ష్మి అమ్మవారి గుడి
7. కార్తికేయ స్వామి ఆలయం
ఈ ఆలయంలో శ్రీవెంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహం తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో చూపరులకు కనువిందు చేస్తుంది. సర్వశక్తిమంతుడు ఆశీర్వదించబడుతున్నట్టుగా ఉంటుంది. ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం తిరుమల స్వామి విగ్రహానికి ప్రతి రూపమని ప్రతీతి. ఈ ఆలయం రాత్రి పూట చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
పవిత్రవనం:
స్వామి వారి పూజ కొరకు ఇక్కడే పవిత్రవనం అనే తోటలో పూలచెట్లు పెంచుతున్నారు. ఈ పూలతోటలోని వివిధ రకాల పువ్వులు ఆయల పూజలకు అవసరమైన మోతాదులో పూలను సమకూర్చుతారు. ఆలయానికి సంబంధించిన కల్యాణమంటపంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు జరుగుతాయి.
ఈ సింఘి దేవాలయం యొక్క ప్రవేశద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంది. లోపల వాయు పుత్రుడైన ఆంజనేయుని విగ్రహం ఈ ఆలయ యొక్క చాలా ఎత్తు అయిన ప్రదేశంలో ఉంటుంది. అక్కడి నుండి భక్తులను ఆయన ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలోనే పద్మావతి అమ్మవారి ఆలయం, శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయం, విగ్నేశాలయం, నవగ్రహాలయం, కార్తికేయ స్వామి ఆలయం వంటి ఉపఆలయాలు కూడా ఉన్నాయి. రోజూ అన్ని దేవుళ్లకు , దేవతలకు పూజలు నిర్వహిస్తుంటారు.దక్షిణ భారత నిర్మాణ శైలిలో నిర్మించబడినది ఈ ఆలయం. ఆలయ నిర్మాణం చోళ-చాళుక్యుల శైలిలో ఉంటుంది.
ఈ ఆలయాన్ని 1991లో నిర్మింపబడినది. హైదరాబాద్ సిటీలో చూడదగ్గ ప్రదాణ ఆకర్షణల్లో సింఘీ దేవాలయం ఒకటి. ఈ ఆలయ మెట్ల పైన గొప్ప రాయితో చేయబడిన ఏనుగు విగ్రహం రక్షణ గా ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న మూడు గోపురాలు ఏంతో ఎత్తుగా ఉంది ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే సూర్యాస్తమయం సందర్భంలో కొండపై నుండి తిలకించే వారికి సూర్యాస్తమయం కన్నులపండుగగా కనబడుతుంది. ఈ ఆలయాన్ని సాధారణంగా సంఘినగర్ ఆలయంగా పిలుస్తుంటారు. నగర శివార్లలో ఉన్న ఈ ఆలయాన్ని రోజూ వందలాది మంది భక్తులు, యాత్రికులు సందర్శిస్తుంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడి భగవంతుని ఆసిస్సుల కోసం వస్తుంటారు. చాలా మంది పర్యాటకులు ఇక్కడి కొండ అందాలని చూడటానికి వస్తారు. రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలో ఆ ఆలయం ఉన్నందున అక్కడివి వెళ్ళే యాత్రికులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. సింఘినగర్ లోని పరమానందగిరి కొండపై ప్రముఖ పారిశ్రామిక సంస్థ సంఘి గ్రూపు యాజమాన్యం 1991లో ఈ ఆలయాన్ని నిర్మించింది. విలాసవంతమైన యాత్ర జరిపేవారికి ఈ ఆలయం విహార క్ష్రేతం. ఈ ఆలయ ప్రాంగణ పరిసరాలలో సినిమా షూటింగ్ లు జరుగుతూ ఉండటం కారణంగా కూడా అనేక మంది ఇక్కడకు వస్తుంటారు. వారాంతాలలో ఎక్కువ మంది సందర్శకులు హాయిగా, సంతోషంగా రోజంతా గడపడానికి కుటుంబసమేతంగా ఇక్కడికి వస్తుంటారు. కొందరికి ఈ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపిస్తుంది. ఇక్కడ వారు ఆధ్యాత్మికతను ఆచరిస్తుంటారు