కూరగాయలు మరియు ప్రయోజనాలు

Sample Image

1. బీన్స్(Beans)

ఇందులో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సరైన మోతాదులో దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణల ఉంటుంది. దీంతో పాటు ఇది నరాలను శుభ్రపరచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

2. వంకాయ(Brinjal )

యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరుగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి. దీన్ని వారానికి రెండు సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయితే రాళ్ల సమస్యతో బాధపడేవారు దీనిని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి

3. బెండకాయ(Ladies finger)

కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ డి మొదలైనవి స్త్రీల వేలిలో పుష్కలంగా లభిస్తాయి. ఇందులో మసిలేజ్ అనే మందపాటి జెల్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

4. టొమాటో(Tomato)

ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ సి, ఎ, కాల్షియం, పొటాషియం, ఇతర ముఖ్యమైనవి ఇందులో కనిపిస్తాయి.

5. బీట్‌రూట్‌(Beetroot)

బీట్‌రూట్‌లో బీటైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. వీటిలో నైట్రేట్లు ఉంటాయి, ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, బీపీని తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా పొటాషియం, మాంగనీస్, ఐరన్, ఫోలేట్, బి విటమిన్లు వంటి మూలకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. బీట్‌రూట్‌లోని ‘బెలాటిన్‌’ అనే యాంటీఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది. దీంట్లో పొటాషియం, ఫోలేట్‌ నిల్వలూ ఎక్కువే. ఇవి నాడులు సక్రమంగా పనిచేసేలా చూడటమే కాకుండా మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీంట్లో ఐరన్‌ పెద్ద మొత్తంలోనే ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది.

6. క్యారెట్‌(Carrot)

క్యారెట్‌లో ఎ,సి,కె,బి విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుండెకు మంచిది. హైబీపీని తగ్గిస్తాయి. టైప్‌-2 డయాబెటిస్‌ను తగ్గిస్తాయి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు నయమౌతాయి. క్యాన్సర్‌ కారకాలను నియంత్రిస్తాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది కెరోటినాయిడ్. బీటా కెరోటిన్ శరీరం లోపల విటమిన్ ఎగా మారుతుంది. కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది.

7. చిలగడ దుంప(Sweet potato)

చిలగడ దుంపల్లో బీటా-కెరొటిన్‌, విటమిన్‌-ఈ, సి, బి-6, పొటాషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. షుగర్‌ పేషెంట్స్‌ చిలగడ దుంప తింటే.. మంచిది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతర్గత అవయవాల వాపుని తగ్గిస్తాయి. ఫైబ్రినోజెన్‌ రక్తం గడ్డకట్టకుండా సాయపడుతుంది. ఇందులో ఉండే కెరొటినాయిడ్స్‌, విటమిన్‌ ఏ వంటివి కంటిచూపుని మెరుగుపరుస్తాయి.

8. టర్నిప్‌(Turnip)

టర్నిప్‌లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది, ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. టర్నిప్‌లో విటమిన్ ఎ, బి , సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీస్‌, రాగి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

9. ముల్లంగి(Radish)

ముల్లంగిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముల్లంగిలో విటమిన్ ఎ, బి6, ఇ, కె, ఫైబర్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి మినరల్స్‌ మెండుగా ఉంటాయి. దీనిలో కాటెచిన్స్, పైరోగల్లోల్, వెనిలిక్ యాసిడ్‌, ఫినోలిక్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముల్లంగిలో గ్లూకోరాఫానిన్ అనే క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. ముల్లంగి రక్తనాళాల ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది, హైపర్‌టెన్షన్‌ తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధపడుతుంటే.. ఇది బెస్ట్‌ ఆప్షన్‌.

10. క్యాబేజీ(Cabbage)

క్యాబేజీలో.. ఫైబర్, ఫోలేట్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు A, K వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాబేజీ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. డిండోలిల్, మెథిన్, సినెగ్రిన్, లూపియోల్, సల్ఫోరాఫేన్, ఇండోల్ త్రీ, కార్బినోల్ క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. క్యాబేజీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యానికి క్యాబేజీ మంచిది. దీనితో పాటు, కాబేజీలో.. కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

11. బంగాళాదుంప(Potato)

ఇందులో ప్రధానంగా పిండి పదార్ధాలు ఉంటాయి. ఓ మోస్తరు బరువున్న దుంపలో 26 గ్రాములు పిండిపదార్ధం ఉంటుంది. ఇది స్టార్చ్ రూపంలో ఉంటుంది కాబట్టి పొట్ట, చిన్న ప్రేవులలోను స్రవించే ఎంజైముల వల్ల జీర్ణం కాదు. జీర్ణం కాని ఈ స్టార్చి నేరుగా పెద్ద ప్రేవుల్లోకి చేరుతుంది. దీంతో పీచు పదార్ధాలు వల్ల కలిగే ప్రయోజనాలే లభిస్తాయి. శరీర పౌష్టికత, కోలాన్ క్యాన్సర్ నుంచి భద్రత, గ్లూకోజ్ ఆధిక్యతను తట్టుకొనే శక్తి, కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడుల తగ్గింపు లాంటి లాభాలు కలుగుతాయి. దుంపను ఉడకబెట్టి ఆరబెడితే జీర్ణంకాని స్టార్చి పరిమాణం పెరుగుతుంది. ఉడకబెట్టిన వేడి దుంపలో 7 శాతం జీర్ణంకాని స్టార్చి ఉంటే, ఆరబెట్టినపుడు అది 13 శాతానికి చేరుతుంది.

12. వెల్లుల్లి(Garlic)

ఆహారం రుచిని పెంచేందుకు ఉపయోగించే వెల్లుల్లి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే సీరం చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, బి, సి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రత్యేక పరిమాణంలో ఉంటాయి.

13. పుట్టగొడుగులు(Mushrooms)

పుట్టగొడుగులు.. వీటినే మష్రూమ్స్‌ అని కూడా అంటాం. ఇవి వెజిటేరియన్స్‌కు.. నాన్‌వెజ్‌ అనే చెప్పుకోవచ్చు. శాఖాహారులకు ప్రొటిన్‌ అందించే సూపర్‌ ఫుడ్‌ అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఎళ్లుగా పుట్టుగొడుగులను ఆహారంగానూ, ఔషదాల్లోనూ ఉపయోగిస్తున్నారు. పుట్టగొడుగు మన డైట్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మష్రూమ్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్-బి1, బి2, బి9, బి12, విటమిన్-సి, విటమిన్-డి2 ఉంటాయి. పుట్ట గొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. ఇవి క్యాన్సర్‌ రాకుండా, శరీల అవయవాల్లో ఇన్ఫ్లమేషన్‌ తగ్గించేందుకు తోడ్పడతాయి.

14. క్యాలీఫ్లవర్‌(Cauliflower)

క్యాలీఫ్లవర్‌లో విటమిన్-బి, సి, కెలతో పొటాషియం, క్యాల్షియం, ఫొలేట్‌, ప్రొటీన్లు, ఐరన్‌, సోడియం, పాస్పరస్‌ , మాంగనీస్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాలీఫ్లవర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి.

15. కాకరకాయ (Bitter gourd)

కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. అలానే ఐరన్, జింక్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటి వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యల నుండి డయాబెటిస్ వరకు ఎన్నో సమస్యలు తొలగిపోతాయి, డయాబెటిస్ వంటి సమస్యల నుండి బయట పడడానికి కాకరకాయ నిజంగా ఎంతో మేలు చేస్తుంది.

16. మునగకాయ(Drumstic)

మునగలో ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.మునగలో అధికంగా లభించే కాల్షియం, ఇనుము తదితర విటమిన్లు ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి.పిల్లలు మునగను కూరలా తిన్నా, సూప్‌ రూపంలో తాగినా ఎముకలు గట్టి పడతాయి.రక్త శుద్ధికి మునగలో ఉండే గింజలూ, ఆకులు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలను కలిగి ఉంటాయి.మునగ యాంటీబయోటిక్‌ కారకంగానూ పనిచేస్తుంది.

17. సొరకాయ(Bottle gourd)

సొరకాయలో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్‌ ఆప్షన్. దీనిలో ఉండే అధికంగా ఉండే పీచు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.

18. క్యాప్సికం(Capsicum)

క్యాప్సికంలో విటమిన్‌ సి, ఇ, బి, ఐరన్‌, కాల్షయం, రాగి, మాంగనీస్‌, యాంటీఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్స్‌, ఫైబర్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాప్సికంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో అవయవాలు, రక్తనాళాలు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. క్యాప్సికంలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువును కంట్రోల్‌లో ఉంచుతాయి. క్యాప్సికం డైట్‌లో చేర్చుకుంటే.. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది, జీర్ణక్రియకు మేలు జరుగుతుంది.

19. గుమ్మడికాయ(Pumpkin)

గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్‌ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ , ఫ్యాటీ యాసిడ్స్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్‌ ఫినోలిక్‌ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి.

20. దోసకాయ(Cucumber)

జీర్ణశక్తిని పెంచుతుంది,కిడ్నీలోని బ్లాడర్ స్టోన్స్ కరిగిస్తుంది,.యాంటీ కాన్సర్‌గా పనిచేస్తుంది.పొట్టలోని అల్సర్లను తగ్గిస్తుంది,రక్తపోటును తగ్గిస్తుంది,శరీరానికి కావాల్సినంత నీరు అందిస్తుంది.తలనొప్పిని నివారిస్తుంది,చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది, గుండ్రంగా కోసి కళ్లపై పెట్టుకుంటే కళ్ల కింద నల్లని వలయాలు, వాపులు తగ్గుతాయి. కీరదోసలో ఉండే ఫైబర్ దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

21. బఠానీలు(Peas)

గ్రీన్ పీస్‌లో మనకు అవసరమైనటు వంటి అన్ని అమినో యాసిడ్స్ ఉన్నాయి. వీటివల్ల మజిల్ టిష్యూస్ రిపేర్ అవ్వడానికి మరియు రీ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. దీనిలో ఎక్కువ శాతం ప్రోటీన్ తో పాటు పుష్కలంగా ఐరన్ కూడా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది అనే చెప్పాలి. పీ ప్రోటీన్‌లో ఎంజైమ్స్‌ను అందించే గుణం ఉంది. దాని వల్ల శరీరానికి కావలసినటువంటి ఎంజైమ్స్ సరైన విధంగా అందుతాయి. గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్న వారికి ఈ గ్రీన్ ప్రోటీన్ చాలా మేలు చేస్తుంది అనే చెప్పాలి. గ్రీన్ అంటే కేవలం గ్రీన్ పీస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రోటీన్. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, పైగా బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుంది. దాంతో గుండెకు సంబంధించిన జబ్బులు కంట్రోల్ లో ఉంటాయి.

22. గోరుచిక్కుడు (Cluster Beans)

గోరుచిక్కుడులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి 100 గ్రాముల గోరుచిక్కుడులో 35 కేలరీలు మాత్రమే ఉంటాయి.వీటితో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, నీరు, ఫైబర్, చక్కెర, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎలు ఉంటాయి.

23 .బీరకాయ(Ridge gourd)

బీరకాయలో కొవ్వులు తక్కువగా, నీరు, ఫైబర్‌ ఎక్కువగా ఉండి, పోషకాలు అధికంగా ఉండడంతో పాటు తొందరగా జీర్ణం కావడమే అందుకు కారణం. బీరకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, థైమీన్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

24. మొక్కజొన్న(Corn)

మొక్కజొన్నలో ఫ్యాట్‌, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఫైబర్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉన్నాయి. మొక్క‌జొన్న‌లో విట‌మిన్ సి, బ‌యో ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. అంతేకాకుండా జింక్‌, పాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం, ఐర‌న్‌లు, ఇత‌ర మిన‌రల్స్ మొక్క‌జొన్న‌లో ఉంటాయి. మొక్కజొన్ని తింటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.

25. ఉల్లిపాయ(Onion)

క్యాన్సర్ అనేది ప్రాణాంతక సమస్య. హెల్దీ ఫుడ్‌తో క్యాన్సర్‌ని కంట్రోల్ చేయొచ్చొని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఉల్లిపాయల్ని ఆహారంలో చేర్చుకోవాలి.ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉండాల్సిందే. ఉల్లిపాయ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఉల్లిపాయలు తినడం వల్ల పేగు ఆరోగ్యం బాగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల పేగులకి పోషణ అందుతుంది. హెల్దీ బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో మలబద్ధకం, గ్యాస్, అజీర్ణ సమస్యలతో బాధపడేవారు ఉల్లిపాయల్ని తినడం మంచిది.హైబీపి కారణంగా ఆరోగ్యసమస్యలు, గుండె జబ్బులు, మూత్రపిండాలు, లివర్ దెబ్బతినడంతో పాటు గుండె సమస్యలు కూడా వస్తాయి. ఉల్లిపాయలు తినడం వ్లల హైబీపి కంట్రోల్ అవుతోంది.