వినాయక చవితి

వినాయక చవితి భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటిగా ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్నాటక, గోవా, ఆంద్రప్రదేశ్, తెలంగాణా మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ప్రధానమైన పండుగగా గుర్తించబడింది. హైదరాబాద్, కర్నాటక ప్రాంతాలలో గణేష్ నిమజ్జనాన్ని దేశమంతా ఆసక్తిగా వీక్షిస్తారు అంటే అతిశయోక్తి లేదు. ఈ పండుగ ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా గొప్ప వేడుకగా జరుపబడుతుంది. పరిపూర్ణతకు మారుపేరుగా వినాయకుని భావిస్తారు.

వినాయకుడు పవిత్రతకు, విజయానికి మారుపేరుగా ఉన్నాడు, క్రమంగా చేపట్టిన ఎటువంటి ప్రాజెక్ట్ అయినా విజయవంతం అయ్యేందుకు సహాయపడుతాడని చెప్పబడింది. ఏ పనిని ప్రారంభించినా, పూజ లేదా యజ్ఞయాగాదులకు తలపెట్టినా, ప్రారంభంలో వినాయకుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. క్రమంగా వినాయకుడే దగ్గర ఉండి ఎటువంటి తప్పిదాలు జరుగకుండా, తలపెట్టిన కార్యాలను విఘ్నం లేకుండా పూర్తి చేయడంలో సహాయం చేస్తాడని చెప్పబడింది.

అందుకే విఘ్ననాయకుడు, విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తారు వినాయకుని. తరచుగా వినాయకుని శ్లోకాలు చదవడం, వినడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరని చెప్పబడింది. శివపార్వతుల కుమారుడైన వినాయకుడు, సంవత్సరంలో ఒకరోజు అతిధిగా వచ్చి 10 రోజులు మనతో సంతోషంగా గడిపి వెళ్తాడు, క్రమంగా మనల్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటాడని చెప్పబడింది. ఈ పది రోజుల తర్వాత తిరిగి తన తల్లిదండ్రుల స్థావరమైన కైలాసగిరికి వెళ్ళిపోతాడు.

వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత :

ఈ వినాయక చవితి పండుగ నిజానికి ఎప్పుడు ప్రారంభమయిందో ఎవరికీ సరైన అవగాహన లేనప్పటికీ, మహారాష్ట్రలో శివాజీ(మరాఠా సామ్రాజ్య స్థాపకుడు) పాలనలో ఈ వేడుకలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మేధస్సు, విజయం మరియు పవిత్రతకు ప్రధాన మూలాధారమైన వినాయకునికోసం ఈ పండుగని జరుపుకునేవారు. ప్రతి కళలోనూ నైపుణ్యాలు కలిగిన వినాయకుడు, తనను పూజించిన భక్తుల పట్ల కృపతో, ఆయా కార్యాలు, కళలనందు విఘ్నాలు లేకుండా పూర్తిచేయడంలో సహాయపడుతాడని చెప్పబడింది. క్రమంగా విఘ్నాలకు నాయకునిగా విఘ్ననాయకుని పూజించడం జరుగుతుంది.

వినాయక చవితి ఎలా జరుపుకుంటారు?

వినాయక చవితిరోజున వినాయకుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకుని వచ్చి, ఈ ప్రతిమను పది రోజుల పాటు పూజించడం జరుగుతుంది. ఈ పది రోజుల తరువాత, విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఒక ప్రాంతంలోని ప్రజలందరూ కలిసికట్టుగా, ఊరేగింపుగా ఆయా ప్రాంతాల వినాయకుని విగ్రహాలను తీసుకుని వెళ్లి, సముద్రంలో లేదా నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అతిథిగా, వచ్చిన వినాయకునికి రోజుకు మూడు సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. దేవాలయాలలో కూడా అదేవిధంగా ఆలయ అధికారులచే పండుగ జరుపబడుతుంది.

వినాయకుని ఎందుకని మొదటగా పూజిస్తారు ?

ప్రతిరోజూ దేవునికి పూజ చేసే ముందు ప్రధానంగా వినాయకుని శ్లోకంతో ప్రారంభించడం ఆనవాయితీగానే కాకుండా, సాంప్రదాయంగా కూడా వస్తూ ఉంది. కానీ, వినాయకుని విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేయడానికే పండితులు సూచిస్తుంటారు, దీనికి కారణం నైవేధ్యారాదకునిగా వినాయకునికి పేరుండడం. క్రమంగా నిత్యనైవేద్యం తప్పనిసరి.

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని కొనుగోలుచేయదలచిన వారు, విగ్రహంలో వినాయకుని తొండం, ఎడమ వైపున ఉండేలా చూసుకోవాలి. విగ్రహం యొక్క రంగు వెర్మిలియన్ రంగులు లేదా తెల్లగా ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు ఇంట్లో పూజించే విగ్రహం ఎట్టిపరిస్థితుల్లో మట్టి వినాయకుడిగా వుండాలి. ఎటువంటి రసాయనాల మిశ్రమాలను జోడించకుండా.

వినాయకుని ఇష్టమైన వంటలైన కుడుములు, మోదకం, మరియు లడ్డు వంటి తినుబండారాలను సిద్ధం చేసి, ప్రతి రోజు అతనికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఎన్నిరోజులు మీ ఇంటిలో విగ్రహాన్ని ఉంచదలిచారో, అన్నిరోజులూ ఖచ్చితంగా మూడుపూటలా నైవేద్యం సమర్పించవలసి ఉంటుంది. వివరాలకోసం మీ దేవాలయ పూజారిని సంప్రదించండి.

విగ్రహ నిమజ్జనం దృష్ట్యా ఖచ్చితంగా నదులు సముద్రాల వద్దకే పోనవసరం లేదు. పారుతున్న నదిలోకలిసే పిల్లకాలువలు, శుభ్రంచేసిన బక్కెట్ నీళ్ళలో కూడా మట్టి విగ్రహాన్ని(రసాయనాలు లేని) నిమజ్జనం చేసి చెట్ల పాదులకు వేయవచ్చని సూచించబడినది. క్రమంగా పర్యావరణాన్ని కూడా కాపాడిన వారవుతారు. భావితరాలను కాలుష్యకోరలకు గురిచేయకుండా జాగ్రత్త వహించవలసిన బాద్యత కూడా మనమీద ఉందని మరచిపోరాదు.